*నాలుగేళ్లుగా రూ. వేల కోట్లు కోట్లు నష్టపోయిన రైతులు
*మద్దతు, గిట్టుబాటు ధర కల్పించాలి
*రైతును గౌరవంగా, గర్వంగా చూడాలి!
*డబ్బులు లాగేసుకుని ఛార్చీలకు ఇచ్చినట్లు వుంది
*రైతుల సంక్షేమం కోసమే పనిచేయాలి
*మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలి
మధిర : తాము పంట పెట్టుబడి ఇవ్వడానికి వ్యతిరేకంగా కాదని అయితే, రైతులకు మద్దతు, గిట్టుబాటు ధర కల్పించి వారిని గర్వంగా, గౌరవంగా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తక్షణం జరగాల్సిన పని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
ఈ రోజు రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్న రైతు బంధు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మునగాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
దేశంలో ఏ ప్రభుత్వమైనా రైతుల సంక్షేమం కోసమే పనిచేయాలని.. కానీ దురదృష్టమేమిటంటే మన రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దళారీలకు లబ్ది చేకూర్చేలా పనిచేస్తోందని తీవ్రంగా ఆయన మండిపడ్డారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా మద్దతు ధర, గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతెంత నష్టపోయారన్న వివరాలను గణాంకాలతో సహా వివరించారు. మద్దతు ధర లేక ఈ నాలుగేళ్లుగా రైతులు ఒక్క మధిర నియోజకవర్గంలోనే కోట్ల రూపాయాలు నష్టపోయారని వివరించారు.
అట్ట హాసంగా ప్రారంభమయన ఈ పథకం రైతులకు నిజమయిన ఊరట, శాశ్వత ప్రయోజన కల్పించదని భట్టి పేర్కొన్నారు.
అన్నదాతల స్వేదం, కష్టానికి ప్రతిఫలమైన పంటకు మద్దతు ధర ఇవ్వక, దళారీల కృత్రిమంగా డిమాండ్ ను తగ్గించడంతో.. వారు కోల్పోయిన డబ్బులు కోట్లరూపాయలు అని భట్టి విక్రమార్క అన్నారు.
ఉదాహరణకు పత్తినే తీసుకుంటే.. 2012-13లో ఎకరానికి సగటున 10 క్వింటాళ్లు పండితే.. అప్పట్లె మద్దతు ధర రూ. 7 వేలు ఉంటే రూ. 70000 వేలు ఆదాయం లభించేది. 2017 విషయానికి వస్తే.. క్వింటాళుకు రూ. 4వేలు మద్దతు ధర ఉంది. దీంతో రూ. 40వేలు ఆదాయం మాత్రమే లభించింది. దీంతో ఏడాది రూ. 30 వేలు నష్టం వచ్చింది. అదే నాలుగేళ్లకు తీసుకుంటే.. మొత్తం 20 వేల రూపాయలను ఒక రైతు కోల్పోయాడు.
ఇక మిర్చి విషయానికి వస్తే.. సగటున ఎకరాకు 30 క్వింటాళ్లు పండితే.. 2012-13లో క్వింటాలుకు రూ.13,200 మద్దతు ధర ఉండేంది. దీంతో ఎకరాకు రైతు రూ.3,96,000 మొత్తాన్ని పొందాడు. ఇదే 2017కు వస్తే.. మిర్చి ధర క్వింటాలుకు రూ.2,500కు పడిపింది. అంటే ఒకరైతు ఎకరాకు వచ్చిన నష్టం అక్షరాలా రూ.3,21,000. ఇదే నాలుగేళ్లకు తీసుకుంటే రూ. 12 లక్షలా 84 వేల 400 రూపాయలను మిర్చి రైతు నష్టపోయాడు.
ఇక మొక్క జొన్న విషయానికి వస్తే.. ఎకరానికి సగటున 35 క్వింటాళ్లు పండితే.. అప్పట్లో మద్దతు ధర 1700 ఉండేది. అంటే రైతుకు 59,500 రూపాయల ఆదాయం లభించేది. ఇదే 2017కు వస్తే.. మద్దతు ధర 1425కు పడిపోయింది. అంటే రైతు ఎకరం పంటకు 9625 రూపాయలు నష్టపోయాడు. ఇదే నాలుగేళ్లకు తీసుకుంటే.. 38,500 రూపాయలను రైతు నష్టపోయాడు.
చివరగా కందుల విషయానికి వస్తే.. ఎకరానికి సగటున 7 క్వింటాళ్లు పండితే.. అప్పట్లో మద్దతు ధర 12000 వేల రూపాయలుగా ఉండేది. అంటే రైతుకు ఎకరానికి 84 వేల రూపాయల ఆదాయం లభించేది. ఇదే 2017 వస్తే.. మద్దతు ధర లేక రూ. 4000 వేలకు పడిపోయింది. ఒక్క కంది రైతు ఒక ఎకరానికి సగుటన రూ. 56 వేలు నష్టపోయాడు. ఇదే నాలుగేళ్ళకు తీసకుంటే 2 లక్షలా 24 వేల రూపాయల మొత్తాన్ని నష్టపోయాడు.
ఇవే కాక రాష్ట్రంలో ఇతర పంటలు పండించిన రైతులదీ ఇదే పరిస్థితి. గతంతో పోలిస్తే.. ఇప్పుడు పెట్టుబడులు, ఖర్చులు మూడింతలుగా పెరిగాయి. అయితే అప్పటితో పోలిస్తే ధరలు మాత్రం దారుణంగా పడిపోయాయి. పెట్టుబడులు పెరిగుతున్న సమయంలో ధరలు కూడా అదే రీతిలో పెరగడం ఆనవాయితీ.
మరీ మఖ్యంగా 2012-13తో పోలిస్తే ధరలు ఈ స్థితిలో దారుణంగా పడిపోవడం రైతును ఆర్థకంగా తీవ్ర నష్టాల ఊడిలోకి నెట్టేసిందని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కారణం వల్లనే రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. అన్నదాలు ఇంత మొత్తంలో నాలుగేళ్లుగా నష్టపోతుంటే.. ఈ ప్రభుత్వం ఇప్పుడు.. రైతు దగ్గర నుంచి డబ్బులు మొత్తం లాగేసుకుని.. ఇంటికి వెళ్లడానికి ఛార్జీలు ఇచ్చినట్లు రూ. 4 వేలు ఇస్తోందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. పంట పెట్టుబడి ఇవ్వడానికి తీను వ్యతిరేకంగా కాదంటూనే.. రైతులకు మద్దతు, గిట్టుబాటు ధర కల్పించి వారిని గర్వంగా, గౌరవంగా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం మార్కెట్ మార్డులో పోగైన లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను తెరిచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అవసరమైన సంచులు, రవాణకోస లారీలను వెంటనే తెప్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
పంట నష్టం వివరాలు
పత్తి(సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల)
ఏడాది మద్దతు ధర మొత్తం
2012-13 7,000 7000X10=70000
2017 4,000 4000X10=40000
సగటన ఏడాది నష్టం= 30,000, నాలుగేళ్లకు = 1,20,000
మర్చి (సగటున ఎకరాకు 30 క్వింటాళ్లు)
ఏడాది మద్దతు ధర మొత్తం
2012-13- 13,200 13,200X30=3,96,000
2017- 2,500 2,500X30=75,000
సగటున ఏడాది నష్టం =3,21,000, నాలుగేళ్లకు నష్టం = 12,84,000
మొక్కజొన్న (సగటున ఎకరాకు 35 క్వింటాళ్ళ)
ఏడాది మద్దతుధర మొత్తం
2012-13- 1700 1700X35=59,500
2017- 1425 1425X35=49,875
సగటున ఏడాది నష్టం =9625, నాలుగేళ్లకు =38,500
కందులు (సగటున ఎకరాకు 7 క్వింటాళ్లు)
ఏడాది మద్దతు ధర మొత్తం
2012-13- 12,000 12000X7=84,000
2017- 4,000 4000X7=28,000
ఏడాదికి సగటు నష్టం =56,000, నాలుగేళ్లకు నష్టం =2,24,000