రాష్ట్రం లొ ఈవ్ టీజర్లబారి నుండి , దాడుల, మోసాల నుండి మహిళలని కాపాడాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడు ఒక ర్యాలీకి నాయకత్వం వహించారు. దాచే పల్లి ఘటనతో అత్యాచారాలుఅంతం కావాలని భీకరోపన్యాసం చేశారు. అత్యాచారాలు చేసిన వారి మొఖం మీద ఎంగిలి మూయాలన్నారు. కఠినంగాశిక్షించాలన్నారు. సమాజం అలాంటి వారిని వెలియాలన్నారు. ఇంకా చాలా చాలా అన్నారు. ఆయన నిప్పు. మాట చెబితే చేస్తారనే పేరుంది. అందువల్ల గత నాలుగేళ్లలో ఆయన పాలనలో మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు జరిపిన టిడిపి నేతలను ఎలా శిక్షిస్తారో, వెలివేస్తారో, మొఖాన ఎంగిలి ఎలా మూస్తారో చూడాలి. తెలుగుదేశం చొటా మోటా నాయకుల నుండి కార్యకర్తలదాక కనీ విని ఎరిగని రీతిలొ మహిళలమీద దారుణం గా దాడులు జరిగాయి..
చంద్రబాబు గారి పాలన లొ మహిళల మీద జరిగిన దాడులు కొన్ని…
1) కులం కంపు తొ నాగార్జున విశ్వవిద్యాలయం “రిషితేశ్వరి” ఆత్మహత్య
2) మహిళా అధికారి వనజాక్షి మీద టిడిపి ఎమ్మెల్యే దాడి
3) కడుపన్న చెయ్యాలి , ముద్దన్నా పెట్టాలి – బాలయ్య అసహ్యకరమయిన డైలాగ్
4) కామ సీ.యం (కాల్ మని సీ.యం ) అన్నందుకు రొజా అసెంబ్లీ నుండి ఏడాది సస్పెండ్.
5) మహిళ వెనకాల పడి , కుక్క కధ చెప్పిన మంత్రి కొడుకు
6) అమలు కాని డ్వాక్రా మహిళల హామీలు మాఫి
7) నారాయణ లో విద్యార్థినుల ఆత్మ హత్యలు
8) విమానం లొ ఏయిర్ హొస్టెస్ తో స్పీకర్ దురుసు ప్రవర్తన.
9) విశాఖ గిరిజన హాస్టల్ స్కూల్ ఆడపిల్లల మీద లాఠి చార్జ్
10) డ్వాక్రా మహిళలని బూతులు తిట్టిన ప్రజాప్రతినిధి
11) బెజవాడ సి.యం క్యాంప్ ఆఫీస్ దగ్గర అంగన్ వాడి మహిళల మీద లాఠి చార్జ్
12) ఆడవారి జీవితం తొ “కాల్ మని” ఆటలు.
13) రాజ్య సభ సాక్షి గా ఆడవారి దుస్తుల మీద కామెంట్లు చెసే ఘనులు
14) ఇళ్ళ పట్టాలు అడిగినందుకు ఇల్లందుపుర్ జన చైత్యన యాత్ర నుండి మహిళల గెంటి వేత
15) బాక్సైట్ విషయం లొ గిరిజనులకి అండగా మాట్లాడినందుకు పాడేరు ఎం.ఎల్.ఏ గిడ్డి ఈస్వరి మీద పొలీస్ కేసు ( బొండా గారు అసెంబ్లీ లొ పాతెస్తా నా కొడకా అంటే కేసులు ఉండవు)
16) బెజవాడ లొ సమస్యలు పరిష్కరించమన్న ఆశా వర్కర్ల అరెస్ట్
17) కర్నూల్ సాయి లాడ్జ్ లొ దేశం నాయకుడి బంధువు 16 యేళ్ళ మైనర్ పై అత్యాచారం.
18) కోడలు మగబిడ్డను కంటా అంటే ఏ అత్త వద్దు అంటుందా అన్న సిఎం
19) కాళహస్తి దేవాలయం లొ మహిళా ఈ.ఒ మీద చిందులు వేసిన దేశం నాయకుని కొడుకు
20) గంగ జాతర లొ ఎం.ఎల్.ఏ హొదా లొ హారతి ఇస్తున్న రొజా గారి పై టి.డి.పి నేతలు కత్తి తొ దాడి చేసి గాయపరిచారు.
21) ఓటుకు నొటు పసిగట్టనందుకు ఇంటిలిజెన్స్ ఐ.జి అనురాధాని విజిలెన్స్ అండ్ ఈడి అడిషినల్ డి.జి.పి గాబదితలీ
22) విమానం లొ సాటి ప్రయాణికురాలిని వేదించిన కార్పొరేటర్
23) పూనా రైల్వే స్టేషన్ లొ తాగి మహిళ వెంట పడిన కార్పొరేటర్లు
24) చిన్న పిల్లల నగ్న చిత్రాలు తీసే ఎం.పి అనుచరులు
25) మే డే (కార్మిక దినిత్షవం) రొజునే విశాఖ బ్రాండిక్స్ ఫ్యాక్టరీ మహిళా కార్మికులమీద లాఠి చార్జ్
26) సంచలనం రేపిన లావణ్య హత్య కేసులొ నిందితులని కాపాడి 10.25 లక్షలకి సెటిల్మెంట్ చెసిన టి.డి.పి నేతలు
27) మెడికొ సంద్యా రాణి ఆత్మహత్య కేసు విఫలం.
28) సమస్యలపై నిలదీసిన వరలక్ష్మి పైకి మైకు విసిరిన తెలుగుదేశం ఎం.ఎల్.ఏ వెలగపూడి రామ కృష్ణ.
29) చిత్తుర్ జిల్లా చిన్నగొట్టిగళ్ళు మహిళా తాహశీల్దారు నారాయణమ్మ మీద టి.డి.పి సర్పంచ్ దాడి..
30) మాచర్ల మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి తెలుగుదేశం గ్రూపు రాజకీయాలకి తట్టుకొలేక పురుగుమందు తాగి ఆత్మహత్య.
31) బద్వేల్ పుట్టాయంపల్లి కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధిని ఉషారాణి ర్యాగింగ్ వేదింపులు తట్టుకొలేక ఆత్మహత్య
32) బాపట్ల ఎంపీపీగా గెలిచిన విజేతమ్మను టీడీపీ జిల్లా అధ్యక్షుడే రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు.
33) విశాఖలొ ప్రేమికుల రొజున బీచ్ ఫెస్టివల్ పేరుతొ బికిని షొ పెట్టించడానికి తెలుగుదేశం చేసిన విశ్వప్రయత్నం
34) మంత్రి పరిటాల సునీత సమక్షంలొ వై.యస్.ఆర్.సి.పి – యం.పి.టి.సి సభ్యురాలు గంగమ్మ పై టి.డి.పి నేతల దాడి.
35) మంత్రి రావేల కిషొర్ నుండి నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ అనుచరులు నా ఇంటిమీద దాడి కూడా చేశారు , తెలుగుదేశం గుంటూరు జెడ్పి చైర్ పర్సన్ – జానీమూన్
36) బ్యాంకు వారి తొ కుమ్మక్కు అయి గుంటూరు కి చెందిన పద్మజ అనే మహిళ కి చెందిన 8 కొట్లు విలువ చేసే ఇంటిని కబ్జా చెసిన తెలుగుదేశం ఏం.పి గళ్లా జయదేవ్.
37) స్కూటి మీద వెల్తున్న అక్క గౌతమిని టి.డి.పి నేత కారు తొ వెంటాడి వేటాడి స్కూటి ని గుద్ది చంపారు – ఆ ప్రమాదం లొ గాయపడిన గౌతమి చెల్లి పావని.
38) తన ఇంటికి వెళ్ళే దారిలొ కడుతున్న ట్యాంకు కొంచం పక్కన కట్టుకుంటె ఇంటికి దారి ఉంటుంది అని అడిగినందుకు మాకే ఏదురు చెబుతావ అని అనంతపురం ఒక తెలుగుదేశం యం.యల్.సి అనుచరులు జల్లిపల్లి టీడీపీ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ మెంబర్ చంద్ర కలిసి సుధ అనే మహిళను రోడ్డుపై పడేసి కొట్టారు.
39) ఆడవారు గ్యారేజీలో ఉన్న కారులాగా వంటింటికే పరిమితం కావాలి. బయటకు వస్తే ప్రమాదాలు జరుగుతాయన్న స్పీకర్ కొడెల శివప్రసాద్.
40) వికృత చేష్టలతొ “ఎన్.ఆర్.ఐ” మహిళను వేధించిన జగయ్యపేట తెలుగుదేశం నేత అక్కినేని లొకేశ్వర రావు కుమారుడు విజయకృష్ణా.
41) స్పీకర్ కొడెల శివప్రసాద్ కొడలు పద్మప్రియ పై అత్తింటి వేదింపులు (కొడెల శివప్రసాద్ గారి కొడుకు భార్య)
42) ఆహ్వానం ఉన్నా మహిళా పార్లమెంట్ కి రానియకుండా మహిళా ఎం.ఎల్.ఏ రొజా అరెస్టు.
43) ఏం.ఎల్.సి ఎన్నికలలొ గెలుపు కొసం , వై.యస్.ఆర్ జిల్లా , వై.సి.పి (ఎం.పి.టి.సి) సభ్యురాలు లక్ష్మీదేవి ని కిడ్నాప్ చేసిన తేలుగుదేశం నేతలు.
44)గుంటూరు జిల్లా క్రొసూరు మండలం ఉద్యందన గ్రామనికి చెందిన 13 ఏళ్ల మహేశ్వరి అనే పాపని తీసుకెళ్ళి లైంగిక దాడి చేసిన తెలుగుదేశం క్రొసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏవురి నాగేశ్వరరావు , మరియు , ఉద్యందన సర్పంచ్ అయిన ఏవురి రామ కొటెశ్వరరావు తముళ్ళు , మేనళ్ళుల్లు రామకృష్ణ , నరెంద్ర, నరసిమ్హరావు,వెంకటేశ్వరరావు.
46) వాట్సాప్ గ్రూపులలొ అశ్లీల వీడియొలు పొస్టు చేసి మహిళా కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టిన నంద్యాల టి.డి.పి మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్.
47) జాతీయ మహిళా దినొత్సవం రొజునే తుందుర్రు లొ ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళలను అరెస్టు చెసిన చంద్రబాబు ప్రభుత్వం.
48) రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు తనని కొట్టారు అని , టెక్కలి సి.ఐ, యస్.ఐ తనను లైంగికంగా వేదించారని , అది చెప్పుకొవటానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకలేదు అని ఆర్.అండ్.బి ఉద్యొగిని కూరపాని కళ్యాణి ఆంధ్ర సచివాలయం గేటు దగ్గర మత్తుమందు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు.
49) నెల్లూరు లొ ఇళ్ళలొ పని చెసుకుంటు జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంభం , ఆ మహిళ 12 ఏళ్ల కూతురిని బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి జిల్లా కి చందిన తెలుగుదేశం నేత , జిల్లా వ్యాపరస్తుల సంఘం అధ్యక్షుడు నరసింహరావు అత్యాచారం చేశాడు దీని ఆ కుటుంభం పొలీసులకి ఫిర్యాదు చెయగా మంత్రి నారాయణ రంగం లొకి దిగి పంచాయతి చేసింది నిజం కాదా.
51) విజయవాడ లొ కెన్సర్ పేషెంట్ అయిన 9వ తర్గతి చదువుతున్న సాయి శ్రీ ఇంటిని కబ్జా చెసి ఆ పాపని , తల్లిని బయటకి గెంటివేసి ఆమె చావుకి కారణం అయిన తెలుగుదేశం ఎం.ఎల్.ఏ బొండా ఉమ అనుచరులు.
52) విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామం లొ లంబసింగి కి చెందిన ఇద్దరు గిరిజన బాలికలపై తెలుగుదేశం యం.పి.టి.సి కొడుకు కొంతమందితో కలిసి అత్యాచారానికి – స్వయంగా కేసు నమొదు చెయనియకుండా చక్రం తిప్పిన యం.పి.టి.సి.