తెలంగాణ కలెక్టర్లలో అందరినీ ఆకట్టుకున్న కలెక్టరమ్మగా ఆమ్రపాలి పేరు సంపాదించుకున్నారు. ఆమె స్వతహాగా యూత్ కావడం.. చలాకీగా ఉండడం.. చొరవతో దూసుకుపోవడం ఆమెకున్న లక్షణాలు. దీంతో ఆమె బాగా పాపులర్ అయింది. అంతేకాదు దూకుడుగా వ్యవహరించడం కూడా ఆమెను జనాలకు చేరువ చేశాయి. కొండలు గుట్టలు ఎక్కి హల్ చల్ చేసినా, ఫిట్ నెస్ రన్ లో పాల్గొన్నా.. ఆమ్రపాలి స్టయిల్ ఎక్కువ మందికి నచ్చింది.
పెళ్లి కాకముందు ఆమ్రపాలి స్టయిల్ డిఫరెంట్ గా ఉండేది. ఆమె అప్పుడప్పుడు మాత్రమే చీరకట్టులో కనిపించేది. ఎక్కువసార్లు అధునాతన డ్రెస్సుల్లోనే దర్శనమిచ్చేది. మోడ్రన్ కాలేజీ అమ్మాయిలా జీన్స్ లో కనిపించేది. హీరోయిన్లకు ఏహాత్రం తీసిపోని రీతిలో స్లీవ్ లెస్, స్కిన్ టైట్ మోడల్ దుస్తుల్లో దర్శనమిచ్చేది కూడా.
రోజుకొక కొత్త స్టయిల్ లో ఆమ్రపాలి జనాల్లో తిరిగేది. మోడ్రన్ అమ్మాయి కావడంతోనే ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వరంగల్ లో అయితే ఏకంగా ఆమ్రపాలిని దేవతతో పోల్చారు. ఆమె ఒడిలో వినాయకుడు సేదదీరుతున్నట్లు గణపతి విగ్రహాన్ని తయారు చేశారు ఆమె ఫ్యాన్స్. అయితే అప్పట్లో అది వివాదం రేపింది. తర్వాత ఆమె మొహానికి రంగు పూశారు అది వేరే విషయం అనుకోండి.
అంతగా మోడ్రన్ కాలేజీ అమ్మాయిలా ఉన్న ఆమ్రపాలి ఇటీవల కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇటీవల కాలంలో ఆమ్రపాలికి ఐపిఎస్ అధికారితో పెళ్లయింది. పెళ్లయిన తర్వాత నుంచీ ఆమ్రపాలి స్టయిల్ మారిపోయిందని వరంగల్ జనాలు చెప్పుకుంటున్నారు.
పెళ్లయిన తర్వాత ఆమె ఎప్పుడు జనాల్లోకి వచ్చినా చీరకట్టులోనే తప్ప మోడ్రన్ దుస్తుల్లో కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. ప్రయివేటు కార్యక్రమాలైనా చీరకట్టులోనే ఆమ్రపాలి బయటకొస్తున్నారు. దీంతో ఆమ్రపాలి కొత్త స్టయిల్ కూడా వరంగల్ జనాల్లోనే కాదు ఆమె అభిమానుల్లో కూడా చర్చనీయాంశమైందంటున్నారు. తాజాగా రైతుబంధు పథకం పై ఆమ్రపాలి సమీక్ష జరిపారు. ఆ సమీక్షలో చీరకట్టులోనే పాల్గొన్నారు. ఆ వీడియో పైన ఉంది మీరూ ఒక లుక్కేయండి.
కలెక్టర్ ఆమ్రపాలి ఏమన్నారో కింద చదవండి.
రైతుబంధు పథకం కోసం గత సంవత్సరం నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఈ నెల 10న ఐనవోలు మండలం సింగారం గ్రామంలో రైతుబంధు పథకాన్ని డిప్యూటీ సియం కడియం శ్రీహరి ప్రారంభిస్తారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 వరకు చెక్కులు పంపిణి చేస్తాము. మూడు వందల ఖాతాలకు ఒక కౌంటర్ పెడుతున్నాం. చెక్కులకు సంబంధించి ఏమైన ఇబ్బందులు వుంటే గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తాము. చెక్కులతో బ్యాంకుకు వెళ్లెటప్పుడు చెక్కు, ఆధార్ కార్డ్ తో పాటు వేరే ఐడీ కార్డ్ ఒకటి తీసుకువెళ్లాలి. జిల్లా లో 42 వేల ఎకరాల పై చిలుకు ప్రభుత్వ భూమిని గుర్తించాము. రైతులు మరణించిన వారి వివరాలు సేకరించడం జరిగింది.