తెలంగాణ జర్నలిస్టు, సోషల్ వర్కర్ హిమజారెడ్డి మరో నిస్సహాయురాలికి చేయూతనిచ్చేందుకు నడుం బిగించింది. ఆమె ఆరోగ్యం బాగు చేయించేందుకు హిమజతోపాటు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి చదవండి. చూడండి. చేతనైన సాయం చేయండి అని హిమజ వేడుకుంటోంది.
ఈ వీడియోలో హిమజారెడ్డితోపాటు ఉన్న అమ్మాయి పేరు సనా మరియంబీ..వయస్సు 15ఏళ్లు..సొంతూరు జగిత్యాల. ఎప్పుడూ చలాకిగా సనాను చూస్తే జీవితంపై ఆశ కలుగుతుంది. పిల్లలంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. కానీ అంత యాక్టీవ్‌గా ఉండే సనా అంటే దేవుడికి చిన్నచూపేమో..తనకి బోన్ కాన్సర్ జబ్బు పెట్టాడు. గతేడాది జూన్ లో పాపకు #hopeforlifefoundation నుండి (CASE NO 16)ఎంతో మంది దాతల సాయంతో కూకట్‌పల్లి ఓమ్నీ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ ఇప్పించాము. అయితే ఏడాది తిరక్కముందే ఆ మాయదారి రోగం మళ్లీ తిరగబెట్టింది. ఏ కాలు ఐతే ట్రీట్మెంట్ ఇప్పించామో ఇప్పుడదే కాలు..నడవడానికి సహకరించడం లేదు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చూపిస్తే..అక్కడి డాక్టర్లు పాప ట్రీట్‌మెంట్ కు లక్షన్నర ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. అసలే పేదరికం.. తండ్రి చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పులు చేసి ట్రీట్మెంట్ ఇప్పించే పరిస్థితుల్లో పేరెంట్స్ లేక..దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా మానవతా హృదయంతో ముందుకు వచ్చి సనాను ఆదుకోవాలని కోరుతున్నారు. ఫ్రెండ్స్ సనా మోముల్లో చిరునవ్వు చెదరకుండా చూద్దాం..తలా ఒక చేయ్యి వేసి ఆ చెల్లిని కాపాడుకుందాం.
లక్షలు,వేలల్లో చేస్తేనే సాయం కాదు ..మీరిచ్చే ప్రతీ రూపాయి సనా ఆరోగ్యం కుదుట పడటానికి సాయపడుతుంది.. అని హిమజ రిక్వెస్ట్ చేస్తోంది.
If u want to help/Donate for above case kindly find our banking details as mentioned below…
Hope For Life Foundation
Axisbank
Acc number 917010065381773
Srinagar colony branch
Hyderbad
IFSC CODE UTIB0000425
Also, You can transfer funds through Paytm …To 9030193123
Contact Nos :
9030193123
8008898948