అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్రకు ఆయన కుటుంబానికి ముఖ్య అనుచరుడు చమన్ గుండెపోటుతో మరణించారు. చమన్ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. 2004 లో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో చమన్ దాదాపు ఎనిమిదేళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014 వ సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున జడ్పిటీసిగా గెలుపోందారు. అప్పుడు జడ్పీ ఛైర్మన్ అయ్యారు.
ముందస్తు ఒప్పందం ఒప్పందం మేరకు రెండున్నర సంవత్సరం తరువాత తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చమన్ కన్నుమూశారు.
చమన్ మృతి పరిటాల ఫ్యామిలీకి పెద్ద దెబ్బ
చమన్ పరిటాల కుటుంబానికి పెద్ద అండగా ఉన్నాడు. ఆయన మరణం పరిటాల ఫ్యామిలీకి పెద్ద లోటుగా టిడిపి నేతలు చెబుతున్నారు. చమన్ కుటుంబసభ్యులను మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. చమన్ కుటుంబానికి అండగా ఉంటామని ఓదార్చారు.