జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ ఎస్ గెల్చిందని ఐటి మంత్రి కెటిఆర్ కు కానుకగా మునిసిపల్ శాఖను ఇచ్చారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఆతర్వాత బాధ్యతలు స్వీకరించారు 2016 ఫిబ్రవరి 18 కెటిఆర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం 100 రోజుల ప్రణాళిక ప్రకటించారు. ఆ ప్రణాళిక చూస్తే ఏమనిపిస్తుందంటే, 100 రోజుల తర్వాత ఇక హైదరాబాద్ లో సమస్యలో ఉండవని, రోడ్లు నున్నగా నిగనిగలాడుతూ కనబడుతుంటాయని, హైదరాబాద్ లో నీళ్ల సమస్య ఉండదని, మొదట వోల్డ్ జిహెచ్ ఎం సి ఏరియాలో రోజూ నల్లా నీళ్లొస్తాయని చెప్పారు. హైదరాబాద్ ఎలా ఉన్న ప్రజలంతా కోరుకునేది రోడ్లు, నీళ్లే. అయితే రెండేళ్లయిపోయినా, ఈరెండు విషయాలలో కెటిఆర్ ఘోరంగా విపలమయ్యారని చెప్పక తప్పదు.ఆయనకు హైదరాబాద్ రెడ్ల మీద వచ్చినంత అపకీర్తి మరో అంశంమీద వచ్చి ఉండదు. హైదరాబాద్ లో రోడ్ల గురించి ప్రజలనుంచి, సోషల్ మీడియానుంచి ఎన్ని విమర్శలొచ్చాయో లెక్కే లేదు. హైదరాబాద్ ఐటి, ఐటిహబ్, అమెరికానుంచి వచ్చే రెండు కంపెనీలు… కాదు హైదరాబాద్. ఇవన్నీ అన్నీ బాగుండే ఏరియాలలో వచ్చే విషయాలు.హైదరాబాద్ పౌరుడు, టూ వీలర్ల మీద, బస్సుల లో ఆటోలలో, కార్లలో తిరిగే ప్రజలు ఎలా నిత్యం రోడ్ల మీద బాధలనుభవిస్తున్నారనేది హైదరాబాద్ ప్రగతికి లక్ష్యం. హైటెక్ సిటీకి దూరంగా ఉండే కాలనీలలో ప్రజలు పడుతున్న కష్టాలు మంత్రికి తెలిసే అవకాశమే లేదు. అందుకే రోడ్ల విషయంలో ఆయన 100 రోజుల కార్యక్రమం ఫెయిలయి 500 రోజులయి ఉంటుంది.
ఇపుడు మంచినీళ్ల సమస్య బయటపడింది మరొక సారి. నీటి సరఫరా విషయంలో కూడా 100 రోజుల కార్యక్రమం ఫెయిలంది. రోజూ నల్లా నీళ్లెలాగు లేకపోయిన కనీసం వచ్చనీళ్ల సమృద్ధిగా రావడం లేదు.
పోయిన సంవత్సరం రుతుపవన వర్షాలు సమృద్ధిగా వచ్చాయి. చెరువులన్నీ నిండిపోయాయి.అయినా సరే నగరవాసులుకు చాలినన్ని నీళ్లు రావడం లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం నగరానికి రోజుకి 602 మిలియన్ల గ్యాలన్స్ కావాలి. ఇప్పటికి 194 ఎంజిడిల నీళ్లు కొరత ఉంది.
ఉదాహరణకి మల్కాజ్ గిరి ఏరియా తీసుకోండి. ఇక్కడ 3.8 లక్షల మంది ప్రజలుంటున్నారు. ఈ ప్రాంతంలో నల్లా కనెక్షన్ లకు ఆర్ ఎఫ్ ఐ డి మీటర్లను బిగించడం జరగ లేదు. అందువల్ల ఈ ప్రాంతానికిఎంత నీరు అవసరమో కచ్చితంగా తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.అందువల్ల మల్కాజ్ గిరి ప్రజలకు ఈ ఏడాది కూడా నీటి కొరత తప్పదు. ఈ ఏరియాలో ఆర్ ఎఫ్ ఐ డి మీటర్లను 40 వేల కనెక్షన్లకు బిగించాలని నిర్ణయించారు. టెండర్ ప్రాసెస్ పూర్తయింది. అయితే, దీనికి సంబంధించిన ఫైల్ మున్సిపల్ శాఖ లో ఇరక్కు పోయి బయటకు రానంటున్నది. ఈ ఫైల్ కు మోక్షం వచ్చినపుడే మీటర్ల బిగింపు కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత నీటి అవసరం అంచనా వేస్తారు. అవసరమయిన నీటిని సరఫరా చేస్తారని అధికారులు చెబుతున్నారు.(నల్లాబొమ్మ ‘తెలంగాణ టుడే’ నుంచి)