టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంథని ఎమ్మెల్యే పుట్టా మధు బ్రాహ్మణ కులస్థులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీరెంత? మీ సంఖ్య ఎంత అంటూ బ్రాహ్మణులను ఘాటుగా విమర్శించారు. తమ్మ చెరువు పునరుద్ధరణ పనులలో శివాలయ కూల్చివేతపై మంథని సర్పంచ్ ఆద్వర్యంలో జరిగిన గ్రామసభలో పుట్టా మధు కరుకుగా మాట్లాడారు. వివరాలు, వీడియో కింద ఉన్నాయి. చూడండి. చదవండి.
పెద్దపల్లి జిల్లా మంథని లో మిషన్ కాకతీయ పనులలో భాగంగా తమ్మ చెరువు ను మినీ ట్యాంక్ బాండ్ గా మార్చుటకు ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించింది. పునరుద్ధరణ పనులు చేస్తూన్న కాంట్రాక్టర్ చెరువు కట్ట పై ఉన్న శివాలయాన్ని కూల్చవేసి నంది విగ్రహాన్ని ఎక్కడో పడవేశాడు. దీనికి నిరసనగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రభస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పుట్ట మధుకు బ్రాహ్మణ సఘం నేతలకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. బ్రాహ్మణ సఘం నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని వారు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అ వాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు.
అలా అంటూనే మళ్లీ బ్రాహ్మణులపై విమర్శలు గుప్పించారు. ‘మా సుద్దరోల్లే ఎక్కువ మొక్కుతే మీకు పైసలు వస్తున్నై’ అని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే ఏమన్నారో వీడియోలో చూడండి.