తనకు వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఫైర్ అయ్యారు. తనకు రానున్న ఎన్నికల్లో టికెట్ రాదంటూ ఒక పత్రికలో పదే పదే కథనాలు రాస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా కుల ప్రస్తావన తీసుకొచ్చారు ఎమ్మెల్యే.
అయితే బెల్లంపల్లి ఎమ్మెల్యే వ్యాఖ్యలను జర్నలిస్టులు ఖండించారు. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ బెల్లంపల్లిలో నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఆందోళన తీవ్రతరమైంది. దుర్గం చిన్నయ్య మీడియాపై ఏం మాట్లాడారో వీడియో పైన ఉంది చూడండి.