తెలంగాణ సర్కారు పై నాగర్ కర్నూలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, నాగర్ కర్నూలు జెడ్పీటిసి కొండా మణెమ్మ ఫైర్ అయ్యారు. కేసిఆర్ కిట్ల పేరుతో హడావిడి చేయడం కాదన్నారు. ముందు గర్భిణీల ప్రాణాలు కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూలులోని గవర్నమెంట్ హస్పిటల్ లో గురువారం రాత్రి ఉయ్యాల వాడ కి చేందిన క్రిష్ణ వేణి అనే గర్భిణి డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద ధర్నా కు దిగారు మణెమ్మ. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మణెమ్మ ఏమన్నారో పైన వీడియోలో చూడండి.