ఆ మధ్య చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఇంగ్లండు వెళ్లాడు. మూడు రోజులు పాటు ఊపిరి సలపనంత చర్చల్లో మునిగిపోయాడు. రాణిగారి భారీ విందు రుచి చూశాడు. అయితే, ఆ మరుసటి బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఆయన్ని చక్కగా చక్కర్స్ లో వాళ్లింటి పక్కనే ఉన్న ప్లోస్ అనే ఒక పబ్ కు తీసుకెళ్లాడు. అంతేకాదు, అపుడపుడు మాచిన్నమ్మాయిని ఈ పబ్ కి తీసుకువచ్చి వదిలిపెట్టివెళుతుంటానని కూడా జి కి చెప్పాడు. ఆతర్వాత పబ్ లో గ్రీన్ కింగ్ ఐపిఎ అనే బీర్ రెండు పింట్ లు చల్లగా లాగించారు.
అక్కడే ఫిష్, చిప్స్ తో లైట్ లంచ్ చేశాడు. చైనా అధ్యక్షుడు వస్తున్నాడని, లేదా దేశ ప్రధాని వస్తున్నాడని పోలీసులు పబ్ లోకి చొరబడి మందు బాబుల్ని తరిమేయలేదు.అంతా ఎవరంతకు వాళ్లు తాపీగా తాగుతున్నారు. వచ్చిందేవరో గమనించే స్థితిలో కూడా లేరు. కామెరాన్, జి ఇద్దరు తలుపు తీసుకుని మెళ్లిగా బార్ దగ్గిరకు వచ్చారు. కామెరాన్ చైనా అధ్యక్షుడు జి కి బార్ టెండర్ ని పరిచయం చేశాాడు. చెరొక గ్లాస్ అందుకుని చక్కగా తాగేశారు. మన ఇండియాలో లాగా హడావిడి లేదు. సెక్యూరిటీ లేదు. పోలీసులు లేరు. … వాళ్లెలా బీర్ తాగారో, ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఇది జరిగి మూడేళ్లయినా ఈ వీడియ్ ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది.