ప్రాజక్టులలో ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యతం ఉంటుందని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో ఆయన మచిలీపట్నంలో క్రిక్కిరిసినసభలో ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.
బందరు పోర్టు గురించి కూడా ఆయన సంచలనాత్మక ప్రకటన చేశారు. బందర్ పోర్ట్ వివాదం చాలా కాలంగా రగులుతూ ఉంది. పోర్ట్ పేరుతో దాదాపు 30 వేల ఎకరాలను రైతులనుంచి ల్యాండ్ పూలింగ్ సమీకరించాలని ప్రభుత్వం వత్తిడితీసుకువస్తున్నది. దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమానికి జగన్, పవన్,ప్రతిపక్ష నేతలు మద్దతు పలికారు. అంత భూమి అవసరం లేదని పర్యావరణ నిపుణులు కూడా చెప్పారు. మాజీ టిడిపి మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి నేతులు కూడా రైతుల పక్షాన నిలబడ్డారు. ఈ ప్రాజక్టును రియల్ ఎస్టేట్ ప్రాజక్టుగా మారుస్తున్నారని సర్వత్రా విమర్శలొచ్చాయి రైతులు ఉద్యమాలు చేశారు. జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. పోలీసుల లాఠీ చార్జ్ చేశారు. చాలా మంది గాయపడ్డారు. అయినా సరే ప్రభుత్వం రైతులు మీద ఇంకా వత్తిడి తెస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో బందర్ పోర్ట్ మీద ఆసక్తికరమయిన ప్రకటన చేశారు. ‘అధికారం లొకి రాగానే
బందరు పోర్టు కడతాం , 4800 ఎకరాల లో మాత్రమే పోర్ట్ కడతాం’ అని ఆయన ప్రకటించారు. అంతేకాదు, అధికారం లొకి రాగానే మొదటి అసంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి 75 % శాతం ఉద్యోగాలు స్థానికులకు యిచ్చేలా చట్టం చేస్తాం,’ అని కూడా జగన్ ప్రకటించారు.
‘గ్రామం లో 10 మంది యువకులకు అక్కడే ఉద్యోగాలు ఇస్తాం .72 గంటలో పెన్షన్ లు మంజూరు అయేలా చూస్తాం.25 ఎంపీ లను నాకు ఇస్తే ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ కి మద్దతు ఇస్తాం,’ అని అన్నారు.