రైలెక్కగానే గరమ్ చాయ్ అనో, గరమ్ సమోసా అనో…మరొకటనో రైల్వే క్యాటరింగ్ సర్వీస్ వెండర్లు వస్తుంటారు. అయితే, జర్నీలో ఏమీ తూచక చాలా మంది ఏవో కొని తినడమో, చాయ్ చప్పరించడయో చేస్తుంటారు. ఇవన్నీ రైల్వే ప్యాంట్రీ కార్ లో తయారవుతుంటాయి.
అయితే, మన రైల్వే ప్రపంచంలో చాలా పెద్ద దని, పొడవైనదని డంబాలు చెప్పుకుంటుంటాం. అయితే, వాటిని నిర్వహణ ప్రయాణికులు ఇస్తున్న చార్జీలతో ఏ మాత్రం సరిపోదు. ఆ మధ్య రైల్వే ఆహారం ఎలా ప్యాక్ చేస్తారో, ఎంత అనారోగ్యకరమయిన ప్రదేశంలో తయారవుతుందో వైరలయిపోయి, ఇక మీ ఫుడ్ మీరే తెచ్చుకోండన్నారు. వాళ్లిచ్చే బెడ్ షీట్లు వారానికొకసారి కూడా ఉతకరని, వాడినివాటినే ఇస్త్రీ చేసి పేపర్ కవర్లో పెట్టిఇస్తున్నారని బయటపడగానే రైల్వే బోర్డు ఛెయిర్మన్ సారీ చెప్పి, మీ దుప్పట్లు మీరు తెచ్చుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. ఈ వ్యవహారం మీద పార్లమెంటులో పెద్ద రచ్చ జరిగింది.
ఇపుడు మరొక సంగతి బయటపడింది. రైల్వే క్యాంటీన్ వాళ్లు, కంపార్ట్ మెంట్ టాయిలట్లనుంచినీళ్లు తోడుకుని కాఫీ టీ తయారీకి వాడుకుంటున్నారు. రైళ్లలో పాలలో టి బ్యాగ్ లు వేసి అమ్ము తుంటారు. ఇలాగే ఈ పాల కప్పులోనే ఇన్స్టంట్ కాఫీ పొడి కలపుతుంటారు. ఈ పాలు కలిపే నీళ్లేవో తెలుసా… టాయిలెట్ లోనివి.టాయ్ లెట్ల నుంచి వాళ్లు నీళ్లు తీసుకుపోతూ ఉండటం ఒక ప్రయాణికుడి కంట పడింది. ఆయన వీడియో తీసి సోష ల్ మీడియాలో పోస్టు చేశాడు.
అది వైరల్ అయింది. ఇది చూస్తే మీకు కడుపు లో దేవినట్లువుతుంది. మరేం పర్వాలేదు. మనం ఓర్చకుంటామని రైల్వే మంత్రికి తెలుసు… వీడియో చూడండి.