తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు సరూర్ నగర్ స్టేడియం ముస్తాబవుతోంది. అన్ని సభలకు, ఈ సభకు స్పష్టమైన తేడా ఏమంటే? ఈ సభ స్టేజీ చాలా పెద్దగా ఏర్పాటు చేస్తున్నారు. వేదిక మీద వెయ్యి మంది కూర్చునేలా సిద్ధం చేస్తున్నారు.
బహుషా తెలుగు నేలమీద ఇంత పెద్ద వేదిక ఇప్పటి వరకు ఎవరూ ఏర్పాటు చేసి ఉండరని జనాలు చర్చించుకుంటున్నారు.
అమరవీరుల కుటుంబసభ్యులు, ఇసుక మాఫియా బాధితులు, తెలంగాణ సర్కారు చేత బేడీలు వేయించుకున్న ఖమ్మం రైతులు ఇలా అన్ని వర్గాల నుంచి జనాలను వేదిక మీదకు ఆహ్వానించనున్నారు.
ముందుగా చెప్పినట్లుగా వెయ్యి మంది కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు జన సమితి నేతలు. అమరవీరుల స్థూపం నమూనాను కూడా వేదిక మీద ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చే ఉద్దేశంతో కోదండరాం పార్టీ నెలకొల్పారు. ఆ విషయం పక్కన పెడితే భారీ వేదిక ఏర్పాటు చేసి రాజకీయాల్లో ఈ రకమైన కొత్త మార్పును మాత్రం కోదండరాం పార్టీ తీసుకొస్తోందన్న చర్చ జరుగుతోంది. భారీ వేదిక వీడియో పైన ఉంది చూడండి.