బాన్స్ వాడ ఆర్టీసి బస్సు కాలిపోయింది. బాన్స్ వాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఎక్స్ ప్రెస్ బస్సు ఇంజిన్ లో పొగలు వచ్చాయి. తర్వాత పొగలు పెరిగిపోవడంతో బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన ఆపారు. దీంతో ప్రయాణీకులంతా బస్సు నుంచి దిగిపోయారు.
అందరూ దిగిపోగానే బస్సు ఇంజిన్ లో మంటలు తీవ్రమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సు కాలిపోయిన ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.