మాజీ సిబిఐ అధికారి, మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపిఎస్అధికారి వివి లక్ష్మినారాయణ గుంటూరు జిల్లా యాజలికి వచ్చారు. నిన్ననే ఆయన రాజీనామాను మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన తర్వాత ఏంచేస్తారనేది ఇంకా తెలియడం లేదు. ఒక రాజకీయపార్టీలో చేరతారని చెబుతున్నారు. ఆయనను దానికి స్పందించడం లేదు. అయితే, తాను రైతులకు సేవచేసేందుకు సీనియర్ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారని ఆయన గుంటూరు జిల్లాలో ప్రకటించారు. లక్ష్మినారాయణ యాజలిలో చేసిన ప్రసంగం వీడియో…
ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
గ్రామాల్లో పనిచేసి రైతులకు సేవ చేస్తానని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నా.
పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నావు.. గ్రామాలు అభివృద్ధి ఎలా చేస్తావని హేళన చేశారు.
అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామాలలో సేవ చేయాలనే బాట పట్టాను. మనమంతా మార్పుకు నాంది పలకాలి…
రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకొని ముందుకు నడవాలనే ఇక్కడి నుంచి మొదలు పెట్టా..
యాజిలి స్కూల్ అద్భుతంగా ఉంది.
భగవంతుడు, రాజు, రైతు లే అన్నదాతలు…
ఆనందం, ధైర్యం తో దేశప్రజలకు అన్నం పెట్టగలుగుతున్న వాడు రైతు…
ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఏటా రెండుసార్లు వస్తుంది…అన్నదాతకు ఇంక్రిమెంట్లు లేవు…
రైతులందరిని ఓకేతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంది అడ్డుకున్నారు…
మహారాష్ట్రాల్లో రైతులు సంఘటితంగా పోరాడి సమస్యలు సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు…
వేలాది మంది రైతులు ముంబయ్ కి తరలి వచ్చారు.