కథ అడ్డం తిరిగింది. దిమ్మ తిరిగిపోయింది. గూబ గుయ్యబెట్టింది. మొత్తానికి చెడ్డీలు తడిసిపోతున్నాయి. ఇదండి.. మీడియా అధిపతులు, ఓ ప్రధాన రాజకీయ పార్టీకి నాలుగైదు రోజులుగా పరిస్థితి. వీరంతా తెలుగు రాష్ట్రాలను.. రాజకీయాలను శాసిస్తున్నారు. అలాంటివారు ఇప్పుడు బాత్రూమ్‌లోకి వెళ్లి ఎవరూ చూడకుండా వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఏం చేయాలో తోచక ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మరీ ఓదార్చుకుంటున్నారు. రాజీ కోసం కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ వర్తమానాలు పంపేందుకు సిద్ధమయ్యారు.
గతంలో వీరు ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగింది. వ్యతిరేక వార్తలు రాయడం, బురద జల్లడంతో అందర్నీ తమ దారిలోకి తెచ్చుకున్నారు. పవన్‌కళ్యాణ్ మీద కూడా అదే పాచిక వదిలారు. కానీ ఆ పాచిక తిరిగి వారి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకూ పచ్చ మీడియా మీద ఎవరికైనా కోపం వస్తే ఓ ప్రెస్‌మీట్ పెట్టి గగ్గోలు పెట్టి బాధపడేవారు. మళ్లీ చేసేదేమీ లేక పచ్చ మీడియాతో రాజీ కుదుర్చుకునేవారు. దాంతో ఆ విషయం అక్కడితో ఆగిపోయేది. ఆ రకంగా పచ్చ మీడియాదే పైచేయి అయింది. కానీ పవన్ అలా చేయలేదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. టీఆర్పీ రేటింగ్‌పై గురి చూసి కొట్టారు. ఆ చానళ్లను బాయ్‌కట్ చేయడంతో పాటు.. బ్లాక్ చేయించడం దగ్గర నుంచి… ఫోన్ల యాప్ రేటింగ్‌ను సైతం ఎలా తగ్గించాలో చేసి మరీ చూపించారు. ఐదు, పది సంవత్సరాలుగా మంచి రేటింగ్‌తో, మంచి వ్యూస్‌తో అందనంత ఎత్తులో ఉన్న ఈ చానళ్ల రేటింగ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది.
దీంతో మీడియా అధిపతలు షేక్ అయ్యారు. అంతేకాదు.. వారికి సంబంధించిన రాజకీయ పార్టీ కింద ఒక్కసారిగా ప్రకంపకనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీ బతికిబట్టకట్టాలన్నా.. ప్రజల్లోకి వెళ్లాలన్నా.. ఆ మీడియానే ఆధారం. తప్పును ఒప్పుగా మార్చాలన్నా.. అభివృద్ద్ధి చేయకపోయినా చేసినట్టు చూపించాలన్నా.. ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలన్నా.. వారికి అదే ఆయుధం. కానీ పవన్ దెబ్బతో ఒక్కసారిగా ఆ మీడియా చానళ్ల బతుకులు ప్రశ్నార్థకమైపోయాయి.. దీంతో వారిని నడిపిస్తున్న గాడ్ ఫాదర్ మళ్లీ పాచిక వేస్తున్నాడు. వీడియోకాన్ఫరెన్స్ పెట్టి మరీ.. ప్రస్తుతానికి కాళ్లబేరమే సరైనదని దిశానిర్దేశం చేశాడట. పవన్‌తో రాజీ చేసుకొని.. బతికి బయటపడాలని… రాజీకి సిద్ధమంటూ వర్తమానాలు పంపాలని నిర్ణయించారట. కానీ పవన్ దగ్గరకు వెళ్లి మాట్లాడ్డానికి ఎవరికీ ధైర్యం చాడం లేదట. అదన్నమాట సంగతి.