ఆమె ఒక డైనమిక్ మహిళా ఎమ్మెల్యే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే వైసిపిలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజాను టిడిపి నుంచి సమర్థంగా ఎదుర్కొన్న ఎమ్మెల్యే. ఆమె పేరు అనిత. విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన టిడిపి ఎమ్మెల్యే. రోజాను ధీటుగా ఎదుర్కొన్న టిడిపి నాయకురాలు ఆమె.
ఆమె చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు ఆమెను పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించారు. అయితే ఆమె ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఆమె పక్కా క్రిస్టియన్. అలాంటి ఇలాంటి క్రిస్టియన్ కూడా కాదు సుమీ. కరడుగట్టిన క్రిస్టియన్. ఆ ముచ్చట ఆమెనే చెబుతున్నారు. ఆమె బ్యాగులో బైబిల్ ఉంటుంది.. కారులో బైబిల్ ఉంటుంది.
అటువంటి కరడుగట్టిన క్రిస్టియన్ ను చంద్రబాబు ఏరికోరి హిందూవుల ఆరాధ్య దైవం ఏడుకొండల వాడి ధర్మకర్తల మండలిలో నియమించారు. ఈ చర్య వివాదం రేపుతోంది. ఇప్పటికే పుట్టా సుధాకర్ అనే వ్యక్తి యాదవుడు అయినా.. ఆయన క్రిస్టియన్ అంటూ దుమ్మెత్తిపోశారు కొందరు స్వాములు. మరి క్రిస్టియన్ ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా చేయడం పట్ల ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.