తనపై, తన తల్లిపై తీవ్రమైన తిట్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెస్పాన్డ్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు వెళ్లారు. అక్కడ ఒక్కో సినీ పెద్దను గట్టిగా ప్రశ్నించారు.
ఇంత జరుగుతున్నా సినీ పెద్దలు ఏం చేస్తున్నారని అడిగారు. ఫిల్మ్ ఛాంబర్ డోర్లు క్లోజ్ చేసి అందరినీ అడిగి తెలుసుకున్శారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని నిలదీశారు. చేతిలో ఛాయ్ తాగుతూ అందరినీ హడలెత్తించారు.
తనను, తన తల్లిని అవమానించిన వారికి ఎలాంటి శిక్ష వేస్తారు. ఈ కుట్రలో భాగస్వాములపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కోరారు. తదుపరి తన కార్యాచరణ ఉంటుందని చెప్పి వెళ్లిపోయారు.
అయితే ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ హావభావాలు చూస్తే సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ వపన్ కళ్యాణ్ పవర్ స్టారే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ హావభావాల వీడియో పైన ఉంది చూడండి.