ప్రపంచ స్థాయిలో రాజధాని అమరావతి నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ కనీసం వంద సార్లు ప్రకటించి ఉంటారు.
అట్టహాసంగా మూడు సార్లు ముచ్చటగా శంఖుస్థాపనలు చేసారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ నదీమతల్లిని, భూమాతను కలిపి కుండడు మట్టి , చెంబుడు నీళ్ళు ( మనీ అనగా మట్టి, నీరు) హస్తినాపురం నుంచి ఆకాశమార్గంలో పయనించి కృష్ణా తీరానికి వేంచేసి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. దాన్ని పరమపవిత్రంగా పరగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మట్టి, నీళ్ళు వచ్చేశాయి, ఇక జనం ఇటుకలు ఇవ్వడమే తరవాయి అంటూ నా అమరావతి, నాఇటుక పేరుతో ఒక్కో ఇటుక్కి పది రూపాయల చొప్పున సిఆర్డిఏ ద్వారా లేదా నాఅమరావతి-నా ఇటుక అనే వెబ్ సైట్ ద్వారా సేకరించారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించిన లెక్కలు లేవు. ఇప్పుడు కొత్త గా రాజధాని నిర్మాణానికి బాండ్లు ప్రజలకు జారీ చేస్తామని, బ్యాంకుల కంటే 1-2 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒకరిద్దరి చేత చెరో పది లక్షల రూపాయలి విరాళం ఇప్పించి ఆనక పత్రికలలో ఫోటోలు కూడా వేయించారు. అసలు ఇంతకీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటంటే.. ప్రస్తుతం పశువులను కాచుకుంటున్నారు. పచ్చటి పొలాలు బీడు భూములు గా మారి యంత్రాల కింద నలుగుతున్నాయి.
ఇది అమరావతి ప్రజారాజధాని అని ప్రభుత్వం త్రీడీ సీడీల్లో చూపించింది. సిఆర్డిఏ ఉన్నతాధికారులు రోజూ అమరావతి నుంచి విజయవాడ కార్యాలయానికి వెల్లువలా వస్తున్న రైతులకు ఏం సమాధానం చెప్పాల్లో తెలియక నోట మాట రాక గుడ్లు తేలేస్తున్నారు. ఈ మధ్య ఒక రైతు సదరు అధికారిని ‘జూనియర్ అధికారివైన నీకు ఇంత పెద్ద పోస్టు ఏలా ఇచ్చారయా? ఇది నీ బలం మీద రాలేదు నీకుల బలం వచ్చే వచ్చింద,’ని ఆయన ఛాంబర్ లోనే దుమ్మెత్తి పోసి విసురుగా వెళ్ళి పోయారు. భూములు తీసుకున్నప్పుడు (లాక్కున్నప్పుడు) -పంచె, చీరలు పట్టువస్త్రాలు ఇచ్చి ఇప్పుడు కాళ్ళ చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారయ్యా అన్న ఆ రైతు ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు.
ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక కూడా ఒక కధనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం 280 కోట్ల రూపాయల తో ఒక సచివుడు పెనుమాక, తుళ్లూరు, ఉద్దండరాయని పాలెం, వెంకటరాయుని పాలెం గ్రామాలలో భూములను బినామీ పేర్ల తో కొనుగోలు చేశారని, దీనిపై ప్రధాని కార్యాలయానికి , కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాతపూర్వక ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు. సుమారు 14 నుంచి 18 మంది ఐఏఎస్ అధికారుల ప్రమేయంపై కేంద్ర నిఘా పెట్టిందని, అమరావతి భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని వర్ణిస్తున్నారు. అమరావతి చుట్టూ మొలకెత్తిన అవినీతి వృక్షాలను కేంద్రం పెకలిస్తుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ తాత్కాలిక సచివాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించిన చంద్రబాబు ప్రభుత్వం శాశ్వత భవనాలు నిర్మాణానికి కనీసం ఆకృతులు (డిజైన్లు)ఫైనలైజ్ చేయక పోవడం వెనుక దాగి ఉన్న చంద్ర రహస్యం ఏమిటంటే- మళ్ళీ తను అధికారం లోకి వస్తేనే రాజధాని నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పడానికే నట. కేంద్ర , ప్రతిపక్షం అడ్డుకోవడం వల్లే తొలి నాలుగేళ్ళలో రాజధాని అమరావతిని నిర్మించలేకపోయానని ఈ సారి గెలిస్తే అమరావతిని పూర్తి చేస్తానని రేపటి ఎన్నికలలో ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నించబోతున్నారని అంటున్నారు. ఇలా ప్రజలను మభ్య పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన నైజం తెలుగుదేశం వాళ్లే చెబుతున్నారు. అయితే, ఈ సారి ఇది కనికట్టు విద్య పనిచేస్తుందా?
-త్రినేత్రుడు
C.m is a very jantile man to hard varker