ఆసీఫా……మన్నించు తల్లీ !

(బండారు రమేష్)

ఏ రాముడు చెప్పాడు రా
చిట్టి తల్లిని చెరచమని ?
ఏ దేముడు పూనాడు రా
పసి మొగ్గని తుంచమని ?

ఏ వేదం రాసింది రా
పైశాచిక ఆనందం ?
ఏ పీఠం బోధించింది రా
బలాత్కార పాఠం ?

మెదళ్ళను వదిలేసి
మొలల్లోకి జారిందా పూనకం
మనిషిని దాటేసి
మర్మాంగంలోకి చేరిందా ఉన్మాదం ?

“ఆఖరి సారంటూ” ….
“మరోసారంటూ” …..
“పందికొక్కుల్లా” మీదపడి …..

పాపం….
ఆడతనం తెలియని
పాప కదరా !
ఆడటమే తెలిసిన
పాదం కదరా !!

అయినా
జరిగిన స్కలనంతో
ఏ భగవంతుడిని అభిషేకిస్తారు ?
కార్చిన వీర్యంతో
ఏ గుడి దీపం వెలిగిస్తారు ?
వేలాడిన అంగంతో
ఏ మత గంటను మోగిస్తారు?

( మన్నించు తల్లీ……..ఆసీఫా !
ఇంతకన్నా ఎక్కువ ఈ దుర్మార్గులను ప్రశ్నించలేను)

*అసీఫా …కొద్ది రోజుల ముందరిలా ముచ్చటగా ఉండేది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *