ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్సార్సీపీ ఎంపిలు ఢిల్లీలో క్షీ ణిస్తున్న ఆరోగ్యం లెక్క చేయకుండా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రాణాలను పణంగాపెట్టి… పోరాడుతున్నారు. సుగర్, బీసీలతో పార్టీ సీనియర్ ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి బాధపడుతున్నా వారు వెనకంజ వేయలేదు. ఆమరణదీక్ష విరమించలేదు.
మేకపాటిని కుటుంబ సభ్యులు, వైద్యులు వారించినా సరే.. ఆయన 73 ఏళ్ల వయసులో ఆమరణదీక్షకు కొనసాగిస్తున్నారు. ఎంపీ వరప్రసాద్కూడా 64ఏళ్ల వయసులో సుగర్, బీపీలతో బాధపడుతున్నా.. ఆయన ఆమరణదీక్షలో ఉన్నారు. వీరి ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వైద్యులు బలవంతంగా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. సీనియర్ ఎంపీ మేకపాటి వాంతులు చేసుకుంటూ.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరిస్థితికూడా విషమించడంతో.. కుటుంబ సభ్యులు, వైద్యులు ఆయన్ని దీక్ష విరమించాల్సిందిగా కోరారు. బలవంతగా ఆస్పత్రికి తరలించారు. అయినా..ఆమరణదీక్షను విరమించడానికి వైవీ నిరాకరించారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కుటుంబ సభ్యులు కోరుతున్నా.. ఎంపీ వైవీ దీక్షవిరమణకు అంగీకరించలేదు. ఎంపీ వైవీ సుగర్ 66 పాయింట్లకు పడిపోయింది. ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తే ఆయన తోసిపుచ్చారు.