టిడిపోళ్లు గాంధీ టోపి పెట్టుకున్నారు… వింత

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం చరిత్రలో ఇలాంటిదెపుడూ జరిగి ఉండదు. తెలుగుదేశం ఎంపిలు మొదటి సారి ఢిల్లీలో ఈ రోజు మహాత్మాగాంధీ సమాధి ఉన్న రాజఘాట్ కు పోయి బాపూజీకి నివాళులర్పించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, విభజన హా మీలను అమలు చేయాలని పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా వారీరోజు మహాత్ముడికి తమ డిమాండ్లను నివేదించారు. పార్లమెంటుకు, ఎంపిల ఇళ్లకు పట్టమని మూడు నాలుగు కిలో మీటర్లు కూడా లేని రాజ్ ఘాట్ ను తెలుగుదేశం ఎంపిలు ఎపుడూ సందర్శంచి వుండరు. రాష్ట్రంలో రాజకీయ వాతావారణ వేడెక్కుతూ ఉండటం, ఎన్నికలు సమీపిస్తూ ఉండటం, ఎపుడూ పెద్దగా మాట్లాడని ప్రత్యేక హోదా  ఏకంగా ఎన్నికల నినాదామయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉండటంతో, టిడిపి ఎంపిలు కూడా పోరాటా పంథా ఎంచుకున్నారు. రాజ్ ఘాట్ సందర్శన ఇందులో భాగమే.

ఈ రోజు వారు తమ పార్టీ పచ్చ జండాను పక్కన పడేసి, ఖాదీ వస్త్రాలు ధరించి, గాంధీ టోపీ కూడా పెట్టుకుని బస్సులో రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. అంతేకాదు, అక్కడ పూలు చల్లి నివాళులర్పించి ప్రతిజ్ఞ కూడా చేశారు. జాతీయ జండాను కూడా ప్రదర్శించారు.

 

చూసేందుకు ఇదంతా వింతగా ఉంటుంది. ఎందుకంటే, రకరకాల షేడ్స్ లో తేనె పసుసు రంగున్న ఖాదీ ధరించే తెలుగు దేశం ఎంపిలు ఈ రోజు కాంగ్రెస్ కల్చర్ కు గురుతుగా నిలబడిన తెల్లటి ఖాదీ ధరించారు. అంతేకాదు, కేంద్రం మీద వత్తిడి తెచ్చేందుకు  జాతీయ జండాను చేతపట్టడం ఈ ఫోటోలలో చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *