యాంకర్ శ్రీరెడ్డి ఇలా ఎందుకు చేసిందబ్బా అని సినీ వర్గాలతోపాటు అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేసిఆర్ స్పందించాలంటూ ఆమె ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగింది. బట్టలిప్పి అర్ధ నగ్నంగా నిరసన తెలిపింది. ఆమెను జూబ్లి హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
అయితే శ్రీరెడ్డి ఎందుకు ఇంతగా నగ్న నిరసన తెలియజేయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బడా మనుషుల గుట్టు రట్టు చేసింది శ్రీరెడ్డి. ఆధారాలు సైతం బయట పెట్టింది. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
కానీ ఆమె డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. పెడ చెవిన పెట్టింది. కనీసం సినీ ప్రముఖులు అయినా ఆమెను పిలిచి అసలు విషయాలు సేకరించలేదు.
ఎవరి వైపు నుంచి స్పందన రాకపోవడంతో శ్రీరెడ్డి ఇలా నగ్న నిరసనకు పూనుకుందని సిని వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మరోవైపు శ్రీరెడ్డి కీలకమైన విషయాలు లేవనెత్తినా.. ఆమె సినీ సమాజంలో జరుగుతున్న చీకటి విషయాలను వెలుగులోకి తెచ్చినా ఆమె వాదనకు మద్దతు లభించడంలేదు. కనీసం మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా రాకపోవడం చర్చనీయాంశమైంది.
అయితే శ్రీరెడ్డి ఎంతగా లోగుట్టు విప్పినా ఆమె వ్యవహార శైలి.. బాగాలేకపోవడం.. జుగుప్స కలిగించేలా ఉండడంతో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆమె దరి చేరడంలేదని అంటున్నారు. ఆమె వాదనలో బలముండొచ్చు కానీ.. ఆమె వ్యవహారిక తీరు మాత్రం సరిగాలేదని పలువురు చెబుతున్నారు.