సినీ నటి శ్రీరెడ్డి నడి బజారులో బట్టలిప్పి నిరసన తెలిపారు. ఆమె చేసిన నిరసనపై ఒక కవి ఏ రకంగా స్పందించారో చదవండి. కవి రాగి సహదేవ్ రాసిన కవితను యదాతదంగా కింద ప్రచురిస్తున్నాం. చదవండి.
‘నడి వీధిలో సినిమా?!’
—————————–
ఆమె బట్టలు విప్పింది
తనివి కాదు!
సినీ ప్రపంచానివి!!
నగ్నంగా నిలుచుంది
తను కాదు
సినీ పరిశ్రమ!!
సిగ్గు పోయింది
శ్రీరెడ్డి ది కాదు!
సినీ
లోకానిది!!
వేసేది
రాముని వేషాలు!
చేసేది
రావణ చేష్టలు!!
నటుల మేకప్
తీసేసింది!
నట జీవితం
ఇంతేనని తేల్చేసింది!!
‘ మా ‘ వీధిలో
తను నిల్చోని!
సినీ లోగుట్టును
నడి వీధి కీడ్చింది!!
ఇపుడు ఆమె
బాధితురాలా?
నిందితురాలా?
న్యాయం చెప్పాల్సింది
ఎవరు?
తలపట్టుకున్న
సినీ రైటర్!
దిక్కులు చూస్తున్న
సినీ డైరెక్టర్!
నరాలు తెగే
ఉత్కంఠ లో
ప్రేక్షక లోకం!!
చట్టం తనపని
తాను చేయాలి!
అన్యాయాన్ని
బోనులో నిలబెట్టాలి!
తప్పు శిక్షించబడాలి!!
మము క్షమింపుమా
కళామ తల్లీ!
ఇది సినిమా?
జీవితమా?
కల్పనా?
సమాధానం లేని
ప్రశ్నలు!
సత్యం సమాధి
కాకూడదన్నదే
కావాలి
జవాబులు!!
——రాగి సహదేవ్