రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో అవసరమయిన ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్న జనసేన నేత పవన్ కల్యాణ్ ఇంకా ఆ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. ఆమరణ నిరాహార దీక్ష ఎపుడుంటుందని విలేకరులడిగినపుడు ఆ విషయాన్ని నాకొదిలేయండని ఆయన అన్నారు.
అయితే, కేంద్రం మీద నిరసన తెలిపే కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ఢిల్లీలో అవిశ్వాసం ముందుకు రాకుండా కేంద్రం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నెల 6న నిరసన పాదయాత్ర నిర్వహించాలని జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలు నిర్ణయించాయి. జాతీయరహదారుల మీదగా పాదయాత్ర సాగుతుంది. ఈ రోజు పార్టీలు విజయవాడలో సమావేశమయి ఆందోళన కార్యక్రమం రూపొందించాయి. సిపిఎం కార్యదర్శి పి మధు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఈ సమావేశంలోపాల్గొన్నారు.
పాదయాత్ర విషయాన్ని జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ నిరసన శాంతియుతంగా ఉంటుందని ఆయన చెప్పారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని పవన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గురించి వ్యాఖ్యానిస్తూ, సీఎం ఢిల్లీ టూర్ ఆలస్యం అయింది.. గతంలొనే చేస్తే బాగుండి ఉండేదని ఆయన అన్నారు.
త్వరలోనే అనంతపురం, ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో మేధావులతో సమావేశం ఉంటుందని అంటూ రాష్ట్ర సమస్యల మీద ఆమరణ నిరాహారదీక్ష జరిపే విషయాన్ని తనకు వదిలేయాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అన్ని పార్టీ లు కూడబలుక్కునే అవిశ్వాసం చర్చకు రానివ్వలేదు. ఏప్రిల్ 15 న అనంతపురం,ఒంగోలు లు లో 24 న, మే 6 నవిజయనగరం లో మేధావులతో సమావేశ మవుతామని ఆయన వెల్లడించారు.