టిడిపి అధినేత చంద్రబాబు జాతీయ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్ర సిఎం గా ఉన్న కాలంలోనే జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపిన చరిత్ర ఉంది. కానీ ఆయన తెలంగాణ విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి సిఎం అయ్యారు. తాజాగా కేంద్రంలోని బిజెపితో తెగ తెంపులు చేసుకున్నారు. బిజెపిపై యుద్ధం ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం తీవ్రమైన పోరాటం సలుపుతున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. మంగళవారం ఢిల్లీలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పార్లమెంటు భవన్ వద్ద చంద్రబాబు ఫొటోలకు ఫోజులిచ్చారని విమర్శకులు సెటైర్లు షురూ చేశారు. ఒకవేళ పార్లమెంటు భవన్ వద్ద ఆయన మొక్కి లోపలికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు కానీ.. ఫొటో గ్రాఫర్లకు ఫోజులివ్వడం ఏంటని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఫొటోగ్రాఫర్లు చెప్పినట్లు విని మెట్లు మొక్కే కార్యక్రమంలో బాబు విమర్శలపాలయ్యారని అంటున్నారు. మీడియాకు ఫోజులు ఇస్తూ చంద్రబాబు వంగి ఎలా మొక్కుతున్నారో పైన వీడియో ఉంది మీరూ చూడండి.