స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మిన్ ప్రశాంత్ అరెస్టు తెలంగాణలో సంచలనం రేపింది. మఫ్టీలో వచ్చిన తెలంగాణ పోలీసులు ప్రశాంత్ ను అరెస్టు చేశారని చెబుతున్నారు. అయితే తాజాగా ప్రశాంత్ ను అరెస్టు చేసిన మఫ్టీ పోలీసుల వీడియో పుటేజీ వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ పనిచేసే ఆఫీసులోకి వచ్చిన మఫ్టీ లో ఉన్న పోలీసులు ప్రశాంత్ ను తీసుకెళ్లారు. ఆఫీసులో ఉన్న సిసి కెమెరాల వీడియో ను బయట పెట్టారు. ఆ వీడియో పైన ఉంది చూడండి.
ప్రశాంత్ అరెస్టు పట్ల తెలంగాణ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రశాంత్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా పనిచేసేవాడని చెబుతున్నారు. ఆయన మల్లన్నసాగర్ బాధితుడు కూడా. మల్లన్న సాగర్ బాధితుల తరుపున శక్తివంచన లేకుండా పనిచేశాడు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులను అరెస్టు చేయడం పట్ల తెలంగాణవాదులు ఫైర్ అవుతున్నారు.
మరోవైపు ప్రశాంత్ కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చీమకు కూడా హాని తలపెట్టని మంచి మనిషి ప్రశాంత్ ను ఎందుకు అరెస్టు చేసిర్రని వారి పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ అరెస్టు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అయితే ప్రశాంత్ అరెస్టుపై ఇప్పటి వరకు పోలీసులు ఏరకమైన వివరణ ఇవ్వలేదు.