తెలంగాణలో ఇప్పటివరకు ఎవరూ నెలకొల్పని రికార్డును తెలంగాణ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి నెలకొల్పారు. ఆమాటకొస్తే తెలంగాణ సిఎం కంటే స్పీకరే ముందున్నారు. మరి ఇంతకూ మధుసూదనాచారి నెలకొల్పిన రికార్డు ఏందబ్బా అనుకుంటున్నరా? అయితే చదవండి. ఈ స్టోరీ.
తెలంగాణలో సిఎం కేసిఆర్ ఏదైనా ప్రకటన చేయగానే గలాబీ శ్రేణులు రంగంలోకి దిగి కేసిఆర్ ఫొటోలకు పాలాభిషేకాలు చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటివరకు వేల సంఖ్యలో కేసిఆర్ ఫొటోలకు, ఫెక్సీలకు పాలాభిషేకాలు జరిగాయి. పార్టీ నేతలే కాకుండా ప్రజా సంఘాలు, ఇతర సంస్థల ప్రతినిధులు కూడా పాలాభిషేకాలు జరిపారు. కానీ డైరెక్ట్ గా ఎవరూ కేసిఆర్ కు పాలాభిషేకం చేయలేదు.
కానీ తెలంగాణ స్పీకర్ ఈ విషయంలో ముందువరుసలోకి చేరిపోయారు. తెలంగాణ సర్కారు తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించడంతో ఆనందంతో భూపాలపల్లి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతో శాయంపేట మండలంలో టిఆర్ఎస్ కార్యకర్తలు స్పీకర్ మధుసూదనాచారికి డైరెక్ట్ గానే పాలాభిషేకం చేసి సంచలనం సృష్టించారు. స్పీకర్ వద్దు వద్దు అంటున్నా క్షీరాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ కార్యకర్తలు. పాలాభిషేకం వీడియో పైన చూడండి.