అమిత్ షా లేఖ ను విశ్లేషిస్తున్న మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి బీజేపి సారధి అమిత్ షా బహిరంగ లేఖ రాసినారు. తాము రాష్ట్రానికి ఏమి చేసినాము, అసలు బాబు రాజకీయంగా బీజేపి కి దూరంగా ఎందుకు వెల్లినారు-వంటి అంశాలు అందులో కీలకమైనవి. రాసింది కేంద్రంలోని కీలకమైన వ్యక్తికావడం వలన ఆ లేఖపై సమగ్ర చర్చ జరగాలి.
ఆత్మవిమర్శ మరచి పరనిందకే పరిమితమైన అమిత్ షా…
లేఖలో కీలకమైన విషయాలను సవివరంగా ప్రస్తావించిన షా కనీస ఆత్మవిమర్శ లేకుండా కేవలం తప్పు అంతా బాబుదే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఎవరు ఏమి చేసినారు, ఏమి జరగాలి అన్నదానికి ప్రాతిపదిక విభజన చట్టం 2014, హమీగా ఉన్న ప్రత్యేకహోదా. విభజన చట్టం అమలుకు సంబంధించి తాము అన్నీ చేసినాము అన్నట్లుగా మాట్లాడారు. విభజన చట్టంలో విద్యా, మౌళికవసతుల కల్పన అనేవి రెండు భాగాలు.
1. విద్యారంగం…. కీలకమైన 11 సంస్థలను 13వ ప్లాన్ పూర్తయ్యేలోపు (2022) చేయాలి. కానీ మేము 9 విద్యా సంస్దలను ఇప్పటికే పూర్తి చేశాము మిగిలిన రెండు కూడా చేస్తాం అన్నారు. 9 సంస్థలలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంకా వివాదంలోనే ఉన్నది. దానికి ఎవరిది బాధ్యతో చెప్పలేదు. షా ఇక్కడ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఏమిటంటే 2022 కి ఇంకా సమయం ఉన్నది అని. చట్టం ప్రదాన ఉధ్దేశ్యం ఆరోజుకి సంస్దలు పూర్తకావాలని కానీ శంఖుస్దాపన చేసేస్దే చాలు పని అయిపోయినట్లు మాట్లాడటం సరికాదు.
2. మౌళిక వసతుల కల్పన….. చట్టంలో సాధ్యాసాధ్యాలను బట్టి చేయమన్నవి చేస్తున్నామని చెపుతూనే దుగిరాజపట్నం, కడప ఉక్కు సాద్యం కాదని కమిటీలు నివేదిక లిచ్చినాయి కాబట్టి చేయలేకపోయినాము అంటూ కడపపై నిర్ణయం తీసుకోబోతున్నాము అని ముగించినారు. చట్టంలో ఉన్నది ఏమిటి సాధ్యాసాధ్యాల పరిశీలన విభజన జరిగిన 6 నెలలలోపు పూర్తి చేయాలి. ఇంకా పరిశీలిస్తున్నాం అన్న మాటకు అర్దం ఉందా. కడప ఉక్కు సాధ్యం కాదు అని కమిటీ రిపోర్టు ఇచ్చింది అంటున్నారు. కమిటి సాధ్ద్యం కాదు అని చెప్పడానికి కారణం ఏమిటి అన్న విషయాలు ప్రజల ముందు ఉంచ కుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం సహేతుకం కాదు. రాష్ట్రానికి రైల్వేజోన్ పరిశీలిస్తున్నాం అని షా ఇపుడు అంటున్నారు. చట్టానికి విరుద్దంగా విశాఖను మాత్రమే పరిశీలించి సాధ్ద్యం కాదు అని కేంద్ర హోంశాఖ ఎలా మాట్లాడుతుంది. చట్టం ప్రకారం గుంతకల్లు, విజయవాడ, గుంటూరును మొదట పరిశీలించాలి. అందుకు భిన్నంగా పరిశీలన చేసి సా ధ్ద్యంకాదు అని చెప్పడం చట్టవ్యతిరేకం. దుగిరాజపట్నం పరిశీలించమని చట్టంలో లేదు. చాలా స్పష్టంగా 2018 మార్చి నాటికి మొదటి దశ పూర్తి కావాలని ఉంది. మల్లీ పరిశీలించమనడంలో ఉద్యేశం ఏమిటి షా గారు చెప్పాలి.
చట్టంలో గాలేరు నగరి, హంద్రీ నీవా, వంశదార ప్రాజక్టులకు నిధులు ఇవ్వాలని ఉంది వాటి ప్రస్తావనే లేదు. హైదరాబాదులోని ఉమ్మడి ఆస్తుల వ్యవహారం అసలు షా గారి దృష్టిలో లేనట్లుంది మరీ ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంద్ర లకు ప్యాకేజీకి సంబంధించి మొదటి 3 సంవత్సరాలలో 1050 కోట్లు ఇచ్చినాము అందులో 12 శాతం మాత్రమే వాడుకోవడం ఆశ్చర్యకరం అన్నారు. నిజమే 12 శాతం వాడటం రాష్ట్రం తప్పు అయితే అసలు ప్యాకేజీ ఎంతో చెప్పకుండా వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ఏటా జిల్లాకు 50 కోట్లు ప్రకటిస్తే రాష్ట్రం ఏలాంటి ప్రణాళిక రూపొందిస్తుంది షా గారు చెప్పాలి. షా గారు చెప్పిన విషయాలలో ముఖ్యమైనది పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతంకు పెంచడం వలన భారీ లబ్ది చేకూరింది అని ఈ విషయంలో కచ్చితంగా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. కానీ అది విభజన చట్టానికి సంబందించిన విషయం కాదు.
అమరావతి… అమరావతికి ఇప్పటికే 2500 కోట్లు కేంద్రం ప్రకటించింది అందులో 8 శాతం మాత్రమే రాష్ట్రం వాడుకుంది. ఇంకా నిధలు ఎలా అడుగుతారు అంటున్నారు. చట్టం ఏమి చెప్పింది శివరామక్రిష్ణన్ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి కేంద్రం సూచనను ఇవ్వాలి. తాము ఏమి సలహ ఇచ్చింది. రాష్ట్రం ఏమి తప్పు చేసింది షా చెప్పలేదు. అంటే రాష్ట్రం తప్పు చేస్తుంటే చూసి మౌనంగా ఉండి హక్కులు అడిగినపుడు తప్పులు ప్రస్తా వించడమా ?
పోలవరం… పోలవరం బాధ్ద్యత కేంద్రానిది రాష్ట్రం అడిగితే ఎందుకు ఇచ్చినారు. మా బాధ్ద్యతను మేమే చేస్తాం అని చెప్పకుండా రాష్ట్రం అడగడం మీరు ఇచ్చి చేతులు దులుపుకోవడం బాధ్ద్యత అనిపించుకుంటుందా. హోదా విషయంలో రాజకీయ పార్టీలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. నిజమే మరి 2014 లో తమరు చేసిన ఘనకార్యం అదే కదా ? నాడు మీరు లబ్ది పొందినారు. నాడు మీరు చేసిన రాజకీయాన్నే నేడు మిగిలిన పార్టీలు చేస్తున్నాయి. ప్రధానమైన ఆరోపణ వినియోగ నివేదిక రాష్ట్రం ఇవ్వలేదు. మరి బాబు మీకు దూరం అయ్యేవరకు మౌనంగా ఉండి దూరం అయిన తర్వాత మాట్లాడటం బాధ్ద్యత అవుతుందా. మొత్తంగా బాబుగారు తమకు దూరం కావడానికి ప్రధాన కారణం రాజకీయ సమీకరణలే అనడం మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంది. కానీ బాబుగారు నేడు కూడా బీజేపీ కి దూరంగా వెల్లకుండా ఉండి ఉంటే మాత్రం సర్దుకుపోయి ఉంటారన్న విషయాన్ని పరోక్షంగా చాలా బాగా చెప్పిన షా గారికి అభినందనలు.
బాబుగారు స్పందించాలి…. షా తనకు రాసిన లేఖపై సెంటిమెంటు రాజకీయాలు చేయకుండా బాబుగారు సూటిగా సమాధానం చెప్పాలి. తమవైపు జరిగిన తప్పుకు బాద్యత తీసుకోవాలి. కేంద్రం ఎక్కడ తప్పు చేసిందో వాటిని అడగాలి. మొత్తంగా అమిత్ షా రాసిన లేఖ ఆదారంగా నైనా రాష్ట్రంలోని ప్రజలు వాస్తవాలను సమగ్రంగా పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలను అర్దం చేసుకోవాలి. తమ రాజకీయ హోదా కోసం చేసే ఉద్యమాలకు బలి కాకుండా తమ జీవిత హోదా కోసం ఉపయోగ పడే అంశాలపై ప్రజలు ఉద్యమించాలి.
-యం. పురుషోత్తంరెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి. 9490493436