(మానేపల్లి రాంబాబు)
కేంద్రం ఇచ్చిన నిధులను తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని అవి మురిగిపోతున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. పది రోజుల కిందట చంద్రబాబు నాయుడు ఎన్డీయేప్రభుత్వం నుంచి ఎందుకు వెళ్లిపోతున్నామో అమిత్ షా కు ఒక లేఖ రాశారు. ఉత్తరంలో ఆయన చాలా నిందలు మోపారు. ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు , ఆంధ్ర కు అన్యాయం అనే పేరు మీద బిజెపి కి వ్యతిరేకంగా చేస్తున్నక్యాంపెయిన్ తో ఆయన చాలా ఆగ్రహం వచ్చినట్లుంది. ఇదంతా లేఖ లో వెలిబుచ్చారు.
“The decision of TDP to quit NDA is unfortunate as well as unilateral, wholly and solely guided by political considerations instead of developmental concerns of Andhra Pradesh”, Shri @AmitShah writes an open letter to Andhra Pradesh CM Chandrababu Naidu https://t.co/M9M4tsisUY
— BJP (@BJP4India) March 24, 2018
దీనికి బదులు రాస్తూ అమిత్ షా బాబు ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏడు వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను చంద్రబాబు ఖర్చు చేయలేదని అన్నారు. మొదటి మూడేళ్లలో ఈ జిల్లాలకు రు. 1050 కోట్లు ఇస్తే, ఖర్చు చేసింది కేవలం 12 శాతమేనని, 88 శాతం నిధులు మురిగిపోతున్నాయని అన్నారు. ఇదే విధంగా రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు విడుదల చేసింది. ఇందులో వేయి కోట్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇస్తే ఖర్చు చేసింది కేవలం 8 శాతమే. ఇాలాంటపుడు అదనపు నిధులెలా విడుదల చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ‘విదేశీ రుణాలకు సంబంధించి కేంద్రం రు.8991 కోట్లకు అమోదం తెలిపింది.మరొక 17,236 కోట్లరుపాయల కోసం చర్చలు సాగుతున్నాయి. ఆమోదించిన నిధులను వాడుకునేందుకు రాష్ట్రం ఎందుకు ముందుకు రావడం లేదు? దీనికోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుచేయాలి. ఎందుకు చేయడం లేదు. స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుచేస్తే, నిధులను ‘ మీకిష్టయిన వేరే పనులకు’ మళ్లించుకోవడం కుదరదు,’ అని అమిత్ షా ఘాటైన వ్యాఖ్య చేశారు. అంటే చంద్రబాబు నాయుడు కేంద్రం ఇచ్చిన నిధులను తనకు ఇష్టమయిన పనులకు మళ్లించుకుంటున్నారని కేంద్రం ఆరోపిస్తున్నది. అంతేకాదు, రాష్ట్రం ద్రవ్యలోటు రు. 16వేల కోట్లను కూడా అమిత్ షా తప్పు పట్టారు. ఇందులో చంద్రబాబునాయుడి రైతు రుణ మాఫీ నిధులను కూడా కలిపారని, అలాంటిపప్పులుడకవు అని ఆయన అన్నారు. అనేక బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా రుణమాఫీ పథకాలున్నాయని, ఆ ఖర్చును ఆరాష్ట్రాలే భరిస్తున్నాయని చెబుతూ ఇదంతా కేంద్రం ఖాతాలో వేసి నిధులు రాలేదనడం సరికాదని ఆయన అన్నారు. 2014 ఎన్నికలలో ప్రజలు బిజెపి-టిడిపి సంకీర్ణానికి తీర్పు ఇచ్చారని అయితే, దురదృష్ట వశాత్తు టిడిపి దీన్ని మొత్తం తానే కాజేయాలనుకుంటుూ ఉందని అమిత్ షా ఆరోపించారు. ఇదిగో ఇదే అమిత్ షా రాసిన 9 పేజీల లేఖ.