సప్త సముద్రాల అవతల ఉన్నా తనను కనిపెంచిన భూమిని మరవని తెలంగాణ బిడ్డ అతను. దశబ్దాల వెనకబాటు వెక్కిరించినా విధిని దిక్కరించిన విజేత అతను. నీ ఉనికే ప్రశ్నార్ధకం అయిన చోట, నీది గాని దేశంలో గెలుపు గుర్రం ఎక్కడం దేశం గాని దేశం లో అసాధ్యం. తనది కాని ప్రాదేశిక ప్రాంతం లో ప్రవాసుల మధ్య తన వైయుక్తిక అభిరుచి అందరిలో బిన్నంగా నిలబెట్టింది అతనిని అతనే రాయదాస్ మంతెన. ఇటీవల ‘తెలంగాణ కబుర్లు’ అనే వెబ్సైటు నిర్వహించిన ఆన్లైన్ సర్వే లో ఉత్తమ ప్రవాస తెలంగాణ వాసిగా (బెస్ట్ యెన్ ఆర్ ఐ(BEST NRI) గా గెలుపొందాడు. దశబ్దాలుగా తెలుగు వాళ్ళు ప్రవాసులుగా ఉన్నా తెలుగు వాళ్ళలో తెలంగాణ ప్రతినిత్యం కనబడకుండా వినబడకుండా చేసారు. ఆస్ట్రేలియా, డెన్మార్క్,దుబాయ్,అమెరికా,లండన్ దేశాలలో స్థిరపడ్డ తెలంగాణ వాసుల ఆకాంక్ష పట్ల వారి పనితీరుమీద ఆధారపడి చేసిన ఈ సర్వే లో నిజామాబాద్ జిల్లా మాచర్ల గ్రామ వాసి ‘రాయదాస్ మంతెన’ అత్యదిక జనాదారణ కలిగిన ‘ప్రవాస తెలంగాణ వాసిగా ఎన్నికయ్యాడు.
ప్రాధమిక విద్యను నిజామాబాద్ లో, ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల లో కంప్యూటర్ సైన్సు పట్టబద్రుడు అయిన న్యూ హ్యాంప్‌షైర్ లో ఫ్రాన్క్లిన్ పియర్స్ విశ్వవిద్యాలం లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివి రెండు దశాబ్దాల కింద అమెరికాలో వెర్మాంట్ లో స్థిరపడ్డాడు. ఆయన అమెరికాలోని మొదట మోర్గాన్ స్టాన్లీ లో ప్రస్తుతం ప్రసిద్ద వాల్ స్ట్రీట్ బ్యాంకింగ్ లో అగ్రగామి సంస్థ అయిన జే పి మోర్గాన్ చేజ్ కి వైస్ ప్రిసిడేంట్ గా పనిచేస్తున్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఆయన మలివిడత తెలంగాణ ఉద్యమానికి అనేక సహాయం సహకారాలు అందించిన ఆయన పలు స్వచ్చంద సంస్థలతో కలిసి పలు బాల, మహిళా సంక్షేమ, విద్య వైద్య రంగాలకు ఇతోదికంగా సహకరిస్తున్నాడు. ఉత్తమ ప్రవాస తెలంగాణ గా గెలుపొందిన ఆయనను పలువురు తెలంగాణ అభిమానులు అభినందించారు.