రాజకీయాల్లో నిజం చెబితే కష్టాలు తప్పవు. నిజం నిష్టూరంగానే ఉంటది కాబట్టి చెప్పినవాళ్లకు తిప్పలు తప్పవు. మరి అబద్ధాలు ఎన్ని చెబితే అంత గొప్ప వాళ్లుగా చెలామణి అవుతారు. అబద్ధాలు చెబితేనే రాజకీయాల్లో పైకొస్తారు. అలా ఉన్నవి, లేనివి అబద్ధాలు చెప్పి రాజకీయాల్లో పెద్ద పెద్ద స్థానాల్లోకి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అబద్ధం అనే పెట్టుబడితో తెలంగాణలో సైతం చాలా మంది ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. మరి ఈ రాజకీయ సత్యం తెలియక పాపం.. టిఆర్ఎస్ పార్టీకి చెందిన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సామల పావని నిజం చెప్పి పదవి పోగొట్టుకున్నారు.
మొదట మీడియాతో మంత్రి కేటిఆర్ సూచన మేరకే తాము రెండు, మూడు శాతం పర్సెంజీ లంచాల రూపంలో తీసుకుంటున్నట్లు కుల్లం కుల్లా చెప్పారు. అంతేకాదు రాష్ట్రమంతా అలాగే నడుస్తుందన్నారు. తాను కూడా అందులో భాగమేనని, ఆ వ్యవహారాలన్నీ తన భర్త చూసుకుంటారని వివరించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ నోట ఈ మాటలు రావడంతో ప్రభుత్వ పెద్దలు ఫైర్ అయ్యారు. దాంతో ఆమెను పదవికి రాజీనామా చేయించారు. ఇలా మాట్లాడిన క్షణాల్లోనే పదవిని కోల్పోయారు సామల పావని.
అయితే మరోసారి పావని మీడియా ముందుకు వచ్చారు. తాను అలా మాట్లాడలేదని, తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. మీడియా అలా చేసిందంటూ భారాన్ని మీడియా మీదకు నెట్టేశారు. అయితే పావని రెండోసారి మీడియా ముందు కంటతడి పెట్టారు. నిజం మాట్లాడి పదవి పోగొట్టుకున్న పావనిని చూసి ఆమె అనుచరులు, కార్యకర్తలు బాధపడుతున్నారు. పావని రెండోసారి ఏం మాట్లాడారో పైన ఉన్న వీడియోలో చూడండి.
మరి మున్సిపల్ సమావేశం సందర్భంగా మీడియాతో ఆమె ఏమన్నారో కింది వీడియోలో చూడండి.