తెలంగాణ సిఎం ఎవరు అని అడిగితే ఎవరైనా చెప్పే పేరు కేసిఆర్ అనే కదా? కానీ కోల్ కత్తాలో మాత్రం తెలంగాణ సిఎం ఎవరన్న సందేహం వచ్చింది. అదికూడా కోల్ కత్తా సచివాలయ సెక్యూరిటీ వాళ్లకు ఈ సందేహం వచ్చింది. బెంగాల్ సచివాలయంలోకి కేసిఆర్ చేరుకుని కారు దిగగానే బెంగాల్ సిఎం పూలగుత్తి అందించి స్వాగతం పలికారు. ఆ తర్వాత వెనక నుంచి కారు దిగి వచ్చిన కేశవరావు మమతా బెనర్జీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆమెను నవ్వుతూ పలుకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో మమతకు బొకే ఇచ్చేందుకు బొకే తెప్పించే పనిలో కేసిఆర్ ఉన్నారు. అప్పుడే అక్కడి సచివాలయ సెక్యూరిటీ సిబ్బందికి డౌట్ వచ్చింది. తెలంగాణ సిఎం కౌన్ హై అని వారిలో వాళ్లే చర్చించుకున్నారు. అందులో ఒక వ్యక్తి చేతికి దట్టీ కట్టుకున్న వ్యక్తి తెలంగాణ సిఎం అని బదులిచ్చారు. తర్వాత మమతకు కేసిఆర్ బొకే అందించడంతో అక్కడి నుంచి సమావేశ మందిరం బయలుదేరారు అందరూ కలిసి.
సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుకున్న మాటలు కింద ఉన్న వీడియోలో ఉన్నాయి వినండి.