ప్రధాని మోదీ ఎపుడూ శుభ్రంగా కనబడతారు. కలర్ ఫుల్ గా ఉండటమే కాదు, ఖరీదయిన బట్టలేసుకుంటారు. ఆయన బట్టలు నలగకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఎపుడూ చిరునవ్వుతో కనిపిస్తారు. నిదానంగానడుస్తూ వెళతారు. విదేశీ అతిధులకు ఆహ్వానం పలికేటపుడు స్లో మోషన్ లో ఉంటారు. ఇవన్నీ కూడాచాలా శ్రద్ధ తీసుకుని ఏర్పాటుచేసుకున్న కెమెరా యాంగిల్సే. దివంగత నేతలకు నివాళులర్పిస్తున్నా ఆయన కళ్లు కెమెరా మీదే ఉంటాయి.
ఆయన బట్టలు, మేనరిజం, నవ్వులు అన్నీ కెమెరా కోసమే అని ఇపుడు అంతా గుర్తించేశారు. తను చేసే పనులన్నీ కెమెరా కోసమే చేస్తారనే టాక్ మొదలయింది. అందువల్ల తనకు కెమెరాకు మధ్య ఎవరైనా అడ్డొస్తేచికాకు పడతారు. ఆయనకు కెమెరాకు మధ్య మరొకరెవరు అడ్డం రాకుండా ఉండేందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా జాగ్రత్త పడతారు. ఇదిగో ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఒక దశలో కెమెరా కు అడ్డొస్తున్నాడని ఆయన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ను పక్కకు లాగేశారు.
(సోర్స్:సోషల్ మీడియా)