తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ఫాలోవర్స్ లో 4.16 లక్షల మంది బోగస్
తెలంగాణ ఐటి మంత్రి చాలా చలాకైన మంత్రి. మంత్రిగా బాధ్యతలు స్వీరించినప్పటినుంచి ఆయన సూపర్ హిట్. మంచి అవగాహన, చక్కగా ఇంగ్లీష్,తెలుగు మాట్లాడటం, ఉర్దు పరిజ్ఞానం ఆయనను జనానికి బాగా చేరువ చేశాయి. మనిషి కూడా ఆకర్షణీయంగా ఉంటారు. అందుకే తొలినుంచి రాజకీయంగా ఆయన అందరిని ఆకట్టుకుంటూ వస్తున్నారు. బహుశా ఇంతతక్కువ కాలంలో జాతీయ కీర్తి ఆర్జించిన ఈ తరం నాయకులలో ఆయన పేరును ముందు చెప్పుకోవాలి. ఆయన ఈ కాలపు మనిషి కాబట్టి, అడ్మినిష్ట్రేషన్ కు సోషల్ మీడియాను సరైయిన సాధనంగా ఎంచుకున్నారు. ఆయన ప్రజలనుంచి వచ్చే ట్విట్లకు బాగా స్పందిస్తారు. అందుకే సెక్రెటేరియట్ లలో ప్రవేశం కూడా దొరకని వారంతా ఒక చిన్న ట్వీట్ తో ఆయనన్ను చేరుకుంటుంటారు. తమ సమస్యఏమిటో చెప్పుకుంటారు. ట్విట్టర్ నుంచే ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తారు.
ట్విటర్ లో ఆయనకు ఒక మిలియన్ పైబడి ఫాలోవర్స్ఉన్నారు. అయితే, ఆశ్చర్యమేమిటంటే ఇందులో దాదాపు సగం మంది ఫేక్ అంటే బోగస్ ఫాలోవర్స్ అని ట్విట్టర్ అడిట్ చెబుతున్నది. ట్విట్టర్ ఆడిట్ ఈ మధ్య ప్రధాని మోదీ ట్విట్టర్ హ్యాండిల్ @narendramodiగుట్టు విప్పింది. ఆయన ఫాలోవర్స్ లో 60 శాతం మంది బోగస్ అని చెప్పింది.
ట్విట్టర్ ఆడిట్. కామ్ (twitteraudit.com)ఏ ట్విట్టర్ హ్యాండిల్ టైప్ చేసిన ఆ అకౌంట్ లో ఎంత మంది రియల్ ఫాలవర్స్ ఉన్నారో, బోగస్ ఎందరో చెబుతుంది. ఈ లెక్కన సెలెబ్రేటెడ్ ట్విట్టరాటి @KTRTRS హ్యాండిల్ పరిశీలిస్తే, ఒక ఏడాది కిందటి లెక్కల ప్రకారం 646,445 Real ఫాలోవర్స్, 416,787 Fake ఫాలోవర్స్ ఉన్నట్లు తేలింది.
ఇక ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేశ్ వ్యవహారానికి వస్తే, twitteraudit.com తాజా సమాచారం అందివ్వ లేకపోయింది. ప్రసుతం, నారా లోకేశ్ @naralokesh 393K ఫాలోవర్స్ ఉన్నారు.
Twitteraudit అందిస్తున్న రిపోర్టు నాలుగేళ్ల కిందటిది. అయినప్పటికి ఆయన అకౌంట్ లో చాలా ఫేక్ ఫాలోవర్స్ఉన్నారు. అపుడు రియల్ ఫాలోవర్స్ కేవలం 86,241 మంది కాగా, ఫేక్ ఫాలోవర్స్ మాత్రం చాలా చాలా ఎక్కువ- 2,49,327 మంది.
అదీ పెద్దోళ్ల పెద్ద విషయాల లోగుట్టు. అందుకే ఏ సెలెబ్రిటీకైనా కోట్ల లో ఫాలోవర్స్ ఉన్నారంటే నమ్మకండి . అందులో చాలా ఫేక్ అంటాయి. కొన్ని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు ఫాలోవర్స్ ని అమ్ముతాయి. మనం కొనవచ్చు.