ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఎపుడూ ఏదో ఒక యాత్రలో నే ఉంటున్నారు. యాత్ర లేనపుడు దీక్ష లో ఉంటున్నారు. ఒక దశలో ఆమరణ నిరాహార దీక్ష అని నాలుగయిదు రోజుల్లోనే పోలీసుల సాకుతో మానేసిన సందర్భాలున్నాయి. ఇాదంతా ఆయన ప్రత్యేక హోదాకోసం చేసినవే. ఈ మధ్యలో ఆయన చాలా సార్లు ప్రధానిని, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. అయినా ప్రత్యేక హోదా గురించి కేంద్రం నుంచి ఆయన తెచ్చిన హామీ కూడా లేదు. ప్రధాని నుంచి ఉలుకుపలుకులేదు. అందుకే ఇపుడు ప్రజాసంకల్ప యాత్ర అని మొదలుపెట్టారు. ఇపుడు ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తుందని, ప్రధాని మోదీ ఇస్తారని, ఆయన మీద తమకు నమ్మకం ఉందని ప్రకటించేశారు. ఇదే మి రాజకీయమూ అర్థం కావడంలేదు. ఈ నేపథ్యంలో జగన్ ని నెటిజన్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ఇవే ఆ ప్రశ్నలు.
జగనన్నా…
1.మీకు మోడీ గారి మీద మీకు అంత ‘కాన్ఫిడెన్స్’ ఉంటే ‘నో కాన్ఫిడెన్స్ మోషన్’ ఎందుకు పెడుతున్నారు?
2. మోడీ గారి మీద మీకు అంత ‘విశ్వాసం’ ఉంటే ‘అవిశ్వాస తీర్మానం’ ఎందుకు పెడుతున్నారు?
3. మోడీ గారి మీద మీకు అంత ‘విశ్వాసం’ ఉంటే తెలుగుదేశం పార్టీ మంత్రులను ఎందుకు రాజీనామా చేయమన్నారు?
4. మోడీ గారి మీద మీకు అంత ‘విశ్వాసం’ ఉంటే తెలుగుదేశం పార్టీని ఎన్.డి.ఏ నుంచి వైదొలగమని ఎందుకు వత్తిడి చేస్తున్నారు?
5. మోడీ గారి మీద మీకు అంత ‘విశ్వాసం’ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలను రాజీనామా చేయమని ఎందుకు గోల చేస్తున్నారు?
6. మోడీ గారితో కలిసి కేసులు మాఫీ చేపించుకోవటమే మీ లక్ష్యమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలభవిష్యత్తుతో ఎందుకు చెలగాటమాడుతున్నారు?
7. మీకు మోడీ గారి మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటె వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి కేసులు మాఫీ చేసుకోండి.
8. మీకు మోడీ గారి మీద మీకు అంత ‘విశ్వాసం’ ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ ను బీజేపీలో కలిపేసుకోండి. ఈ రాజకీయం బిజెపితో చేతులు కలిపేందుకు కాదా?
మీ రాజకీయ స్వార్ధం కోసం మా పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?