ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా గాంధీభవన్ లో మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నెరేళ్ల శారద అధ్యక్షతన మహిళల సమావేశం జరిగింది..ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీమతి శాంతా సిన్హా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
మహిళలకు సమాజంలో సమానత్వం రావాలని, మహిళలు చదువుకుని విద్యావంతులై చైతన్య వంతులు కావాలని ప్రొఫెసర్ శాంతా సిన్హా పిలుపునిచ్చారు. బాలికలు చవుకుకోనీయకుండా త్వరగా పెళ్లిళ్లు చేసే దురాచారం ఇంకా మనచుట్టూ ఉందని ఆమె అన్నారు. మహిళల కదలికలమీద అనేక ఆంక్షలు ఉన్నాయని, ఇవి వారి పురోగతికి ఆటంమని ఆమె అన్నారు. ఇలాంటి పద్ధతులు పోయేందుకు చట్టాలు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.
చట్టంలో మార్పులు చేసి బాలికలు కచ్చితంగా చదువుకునేలా చేయాలని, పిల్లల,మహిళల హక్కులకై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.