తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ప్రసంగం. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ లో ఒక మంచి, స్పష్టత, రాజకీయావగాహన ఉన్న నాయకురాలు కనిపిస్తూ ఉంది. శారదకు గుర్తింపు వచ్చింది కూడా ఉపన్యాసంతోనే. 2004 ఎన్నికలలో యుపిఎప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పంచాయతీ రాజ్ సదస్సును ఢిల్లీలో ఏర్పాటుచేసింది. అక్కడ మాట్లాడేందుకు శారదకు అవకాశం లభించింది. అంతే, హిందీలో ఎంత చక్కగా ఆమె మాట్లాడారంటే, ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికాసోనీకి ఏదో చెవిలో చెప్పారు. అంబికా సోనీ, శారద దగ్గరకువచ్చి రేపు మేడం ని కలవాలి అని చెప్పి వెళ్లిపోయారు. ఇపుడీ ప్రసంగం వినండి: