బిజెపి తీర్ధం పుచ్చుకున్న సినీ నటి కవిత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనని అవమానించి పార్టీ నుంచి గెంటేశాడని సినీ నటి కవిత తీవ్రమయిన ఆరోపణ చేశారు. ఈ రోజు ఆమె
పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో బిజెపి చేరారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ను తీవ్రంగా విమర్శించారు. ‘‘పనిచేసిన వారికి సముచితన్యాయం చేస్తానని చంద్రబాబు పదే పదే చెబితే న్యాయం చేస్తారని అనుకున్నా.ఇప్పటివరకు న్యాయమైతే ఏమీ జరగలేదు. చంద్రబాబు మోసకారి అని చాలా మంది చెబుతున్నా నమ్మలేదు..ఇప్పుడే అర్ధమైంది,’’ అని ఆమె అన్నారు.
ఎన్టీఅర్ పై నమ్మకంతొనే టిడిపిలొచేరానని చెబుతూ చంద్రబాబు ఎన్టీఆర్ హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు.‘‘చంద్రబాబు ప్రతి పోరాటంలో నేను పాల్గొన్నా.. అయినా నన్ను అవమానించి, బాధపెట్టి గెంటేశారు,’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి కండువా వేసి ఆమెను బిజెపి నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.బిజెపి లో చేరిన తర్వాత కంటతడిపెట్టారు. సినీ నటి కవిత కామెంట్స్
ఆ తర్వాత ఇలా అన్నారు-
‘‘1983 నుంచి టిడిపి కి కష్టపడి సేవ చేశాను.నేను టిడిపి నుంచి బయటకు రాలేదు.గెంటపడ్డాను. 294 నియోజకవర్గాల్లో టిడిపి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడ్డాను.పార్టీ కోసం కష్టపడితే అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. తిడుతున్న వారికేమో చంద్ర బాబు పదవులిచ్చారు…పార్టీ కోసం పనిచేసిన వారికి మొండిచేయి చూపారు,’’ అని కవిత పేర్కొన్నారు.