ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గుట్టు విప్పుతున్న విశ్లేషణ
చంద్రబాబు అంకెల గారడి- చేతిలో ఉన్నది 86 వేల కోట్లు. కేటాయింపులు ఒక లక్షా 60 వేల కోట్లు
చేతిలో 86 వేల కోట్లు పెట్టుకుని వివిద విభాగాలకు, రంగాలకు ఏకంగా లక్షా అరవై వేల కోట్లు కేటాయించే దైర్యం ఎవరికైనా ఉందా అంటే ఉంది, అది మన ముఖ్యమంత్రి చంద్రాబాబుకి మాత్రమే. అది ఎలా అంటారా పరి శీలించండి…….
2019 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంచనా 1,91,063 కోట్లు. రాబడికి ఉన్న అంచనా…… రాష్ట్ర ఆదాయం- 65,535 కోట్లు, కేంద్రపన్నుల వాటా-33,930 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు- 50,696 కోట్లు, వడ్డీల ద్వారా 275 కోట్లు మొత్తం 1,50,433 కోట్లు కానీ బడ్జెట్ మాత్రం 1,91,063 కోట్లుకు ప్రవేశపెట్టినారు.
మిగిలిన దాదాపు 40 వేల కోట్లను ఎలా భర్తీ చేస్తారో చూడాలి. బడ్జెట్ లో ఈ మధ్య కాలంలో తీసుకు వచ్చిన ముఖ్యమైన మార్పు ప్లాన్, నాన్ ప్లాన్ పద్దును వేరుగా చూపకపోవడం. నాన్ ప్లాన్ అంటే పాలనా ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు. ఇవి ప్రతి సంవత్సరం పెరిగేవి తప్ప తగ్గేవి కావు. వాస్తవ ఆదాయం నుంచి ఈ ఖర్చును మినహయించి చూపేది ప్లాన్ బడ్జెట్ అపుడు ప్రభుత్వం దగ్గర నికరంగా ఎంత ఉంది తెలిసిపోతుంది. కాని బాబుగారి ప్రభుత్వం రెండింటినీ కలపడం వలన పద్దు సైజు బాగా పెంచి చూపించి అన్ని రంగాలకు విపరీతంగా కేటాయింపులు చేసినట్లు చూపినారు. వారు నాన్ ప్లాన్ ను కలిపినంత మాత్రాన వాటి ఖర్చును తగ్గించలేరు. ఆ లెక్కను కూడా పరిశీలిస్దే…. రుణాల వడ్డి కోసం….15,786 కోట్లు, పాలనా వ్యయం 9500 కోట్లు, ఉద్యోగుల జీతాల కోసం 39,121 కోట్లు అవసరం అవుతాయి. ఇంకా ఉద్యోగులకు డీ ఏ లు ఈ ఏడాది చివరకు 4 బకాయిలు ఉంటాయి. వాటి ఖర్చు ఎంత తక్కువ అయినా 4,5 వేల కోట్లు ఉంటుంది. గత పీ ఆర్ సీ బకాయి 3 వేల కోట్లు అలా పాలనా వ్యయం 10 వేల కోట్లుదాకా పెరుగుతుంది. పెరిగే వాటిని మినహయించి చూచినా నాన్ ప్లాన్ పద్దు అక్షరాలా 64,407 కోట్లు. అలా బాబుగారి దగ్గర మిగిలేది 86,026 కోట్లు మాత్రమే.
మరో ముఖ్యమైనది ఖర్చులు వాస్తవమే కానీ ఆదాయం అంత కచ్చితం వస్తుంది అనలేము. ఆదాయం కేవలం అంచనా మాత్రమే. గడిచిన పద్దును గమనిస్తే రాష్ట్ర ఆదాయం 52,715 కోట్లు అయితే ఈ ఏడాది ఏకంగా 18,820 కోట్లు దాకా అదనంగా వస్తుంది అని అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి కూడా వచ్చే వాటా అంచనాను గత ఏడాదితో పోల్చితే 18,077 కోట్లు అదనంగా వేసినారు. అలా రెండూ కలిపి వేసిన అదనపు అంచనా విలువ ఏకంగా 36,891 కోట్లు ఈ అంచనాలలో వ్యత్యాసం వస్త మొత్తం వ్యవహరం బెడిసి కొడుతుంది. ఇక రాష్ట్రం ఆశించేది విదేశీ అప్పు ఇప్పటికే ప్రతి వ్యక్తిపేరు మీద బాబుగారు చేసిన అప్పు ఏకంగా 50 వేల రూపాయిలకు చేరుకుంది. ప్రజలకు వచ్చే అనుమానం, మరి ఇలా చేసిన కేటాయింపులు ఏలా అమలు చేస్తారు అని. తిరుపతిలోనే బాబుగారు ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చెప్పిన విషయం ఏమిటి అంటే హంద్రీనీవా ను ఈ ఏడాది చివరకు పూర్తి చేస్తాం అన్నారు. కేటాయింపులకు లక్ష్యానికి పొంతన లేదు కాదా అని అడిగితే ముఖ్యమంత్రిగారు చెప్పిన సమాధానం ఏమిటంటే మీకు పేపర్ పై లెక్కలు కావాలా లేదా పనులు కావాలా అని బదులిచ్చినారు. అంటే పద్దులో చూపే లెక్కకు చేసే ఖర్చుకు సంబందం లేదు అన్న మాట.
రాయలసీమకు పొంచి ఉన్న ప్రమాదం
చేతిలో ఉన్న నిధుల కన్నా ఎక్కువ కేటాయింపులు చేస్తే జరిగే నష్టం ప్రాధాన్యత లేని రంగాలు, ప్రాంతాలకు( అంటే అర్థం ప్రభుత్వం దృష్టిలో రాజకీయంగా ప్రాధాన్యత లేని రంగాలు, ప్రాంతాలు అన్న మాట. ) కేటాయించిన నిదులలో కోత పెడతారు. బాబుగారికి రెండు కల్లు పోలవరం-అమరావతి ఆ లెక్కన చూస్తే ఉన్న 86 వేల కోట్లలో అమరావతికి 8 వేల కోట్లు, పోలవరానికి దాదాపు 10 వేల కోట్లు కేటాయించినారు. మిగిలిన 68 వేల కోట్లలో ఖచ్చితంగా పెన్షన్ లకు, వివిధ సామాజిక తరగతులుకు కేటాయించిన పధకాలకు ఎన్నికల ఏడాది కనుక కేటాయించిన దాని కన్నా ఎక్కువే ఖర్చు చేయక తప్పదు కనకు ఖర్చు చేస్తారు.. కేటాయించిన వాటిలో కోత పెట్టడానికి అవకాశం ఉన్నది బాబుగారి పాలనలో ప్రాధాన్యత లేనివి ప్రాంతం రాయలసీమ నీటి ప్రాజెక్టులు. ఇచ్చిన నిధులే అరా,కొర వాటిని కూడా ఖర్చు చేయడం ఇపుడు బాబుగారి అంకెల గారడి పద్దులో అనుమానమే. నిజానికి పోలవరం, రాజదాని మౌళిక వసతుల కల్పన బాద్యత కేంద్రానిది అలాంటి వాటికి ఏకంగా సంబంధం లేని రాష్ట్రపద్దులో దాదాపు 18 వేల కోట్లు కేటాయించడం అభ్యంతరకరం. పద్దును అసెంబ్లీ ఆమోదం లోపల ఈ కేటాపులను రద్దు చేసి వాటిని విభజన చట్టం ప్రకారం కేంద్ర నిధలతోనే చేపట్టి ఆ నిధలను రాయలసీమ, ఉత్తరాంద్ర అవసరాల కోసం ఖర్చు చేయడం ద్వారానే సీమకు న్యాయం జరుగుతుంది. అలా కాకుండా బాబుగారి పద్దును అలానే ఆమోదించి అమలు చేస్తే మాత్రం రాయలసీమకు జరిగే అన్యాయం అపారం. మరి రాయలసీమ సమాజం హోదా హోరులోనే మునిగిపోతుందా. బాబుగారి పద్దులో జరిగిన, జరగబోయే నష్టనివారణ కోసం ప్రయత్నిస్తుందా…..