తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు కేంద్ర క్యాబినెట్ కు రాజీనామ చేయడంతో అయ్యో ఆంధ్రకు ఉన్న అతి ముఖ్యమయిన శాఖ పౌర విమాన శాఖ పోయిందే అని చాలా మంది బాధపడ్డారు.అయితే, మోదీ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖని అంధ్రకే ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ఎంపికి ఆ శాఖ బాధ్యతలను అప్పగించారు…. బిజెపి అనగానే ఎవరికైనా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ హరిబాబు, లేదా గోకరాజు రంగరాజు గుర్తుకొస్తారు. బిజెపికి మరొక ఎంపి ఉన్నాడన్న విషయం ఎపుడూ గాని గుర్తుకు తెచ్చుకోవలసిన సమయం వచ్చింది, ఇలా…
అంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ మద్దతు తో రాజ్యసభకు ఎన్నికై న నాయకుడొకరున్నారు. ఆయన పేరు సురేశ్ ప్రభు(మహారాష్ట్ర). ఇపుడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి. ఆయన ఆంధ్ర ఎంపియే కదా. ఆ సురేష్ ప్రభు కి అశోక్ గజపతి రాజు ఇంతవరకు చూసిన పౌర విమానశాఖ అదనపు భాద్యతలుగా అప్పగించారు. ఈ మేరకు
ఈ రోజు మద్యాహ్నం రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీ చేశారు..
As advised by the Prime Minister, #PresidentKovind has directed that Shri Suresh Prabhu, Cabinet Minister, shall be assigned charge of the Union Ministry of Civil Aviation, in addition to his existing portfolio
— President of India (@rashtrapatibhvn) March 10, 2018
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు అశోక్ గజపతి రాజు విమానయాన శాఖ చెపట్టిన తరువాత నూతన రాష్ట్ర అంధ్రప్రదేశ్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లు అభివృద్ధి కి ప్రణాళిక సిద్దం చేశారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం స్దాయికి తీసుకుని రావటానికి కృషి చేశారు. రాష్ట్రంలో 14 ఎయిర్ పోర్టులను కట్టే ప్రతిపాదనలున్నాయి.
మళ్ళీ ఇప్పుడు అంధ్రప్రదేశ్ కే అ శాఖ రావటం తో అంతా అనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని మోదీ ఇలా చేశారా… అంటే ఈ శాఖ పనులు అశోక్ లేకపోయినా ఆగిపోవని మోదీ ఇలా అభయం ఇచ్చారని అంటున్నారు.