డిల్లీ లో పార్లమెంటు ప్రధాన ద్వారం దగ్గర టిడిపి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి హంగామా సృష్టించారు. అక్కడ ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులకు దగ్గరకు వచ్చి, ఇక్కడ కాదు ఆందోళన, రండి లోపలికి, అక్కడరాజీనామా చేద్దామని వాగ్వాదానికి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు జాతీయ మీడియాతో మాట్లడుతున్న సమయంలో ఆయన అక్కడచొరబడటమే కాకుండా గొడవ చేయడం నిజానికి కోపం కంటే అందరికి నవ్వు తెప్పించింది. ఈ మధ్య ఆయన కార్యకలాపాలన్నీ పెద్ద జోక్ అయిపోయాయి.
ఆయనేం చేశారో తెలుసా
మీసం తీప్పి తోడ గోట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులకుఛాలెంజ్ విసిరారు. ‘ఇక్కడ కాదు ఆందోళన..మాతో రండి రాజీనామా లు చేద్దాం’ అంటు వైసిపి పార్లమెంటు సభ్యులను లాగేశారు.