తెలంగాణ అన్ని జిల్లాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జోరుగా సాగుతూ ఉంది. ఈ రోజు హైదరాబాద్ ఎల్ బి నగర్ డివిజన్ లోని మోహన్ నగర్ ప్రాంతంలో ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో భాగంగా జరిగింది. నిజానికి కొత్త రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఉన్న దానిని పట్టించుకోకుండా ఎక్కడ చూసిన టిడిపి కార్యకర్తుల ఉత్సాహంగా ఈ కార్య క్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ లో టిడిపికి ఈ కార్యక్రమం గొప్ప క్యాంపెయిన్ అయింది. ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, పార్టీ ఫిరాయించిన, తెలుగుదేశం గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తలు ఉత్సా హం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ టిడిపి ఉవ్వెత్తున పైకి లేచే రోజు ఎంతో దూరంలో లేదని కార్యకర్తులు నమ్ముతున్నారు.
మోహన్ నగర్ లో సాగిన ఇంటింటికి టిడిపి వీడియో ఇది…