అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం ఇన్ని సంవత్సరాలు ఉండవలసిన అవసరం లేదు,అయినా సరే, 🎥 బి జె పి తో తెగతెంపులు చేసుకుని ఆలస్యంగా నైనా బయటకు రావడం చాలా సంతోషం అని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు.
తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్లు ఇప్పటికైనా రాష్ట్రంలో అందర్ని సమీకరించి ప్రత్యేక హోదా సాధన ఐక్య ఉద్యమం చేయ్యలని ఆయన చంద్రబాబుకు సలహా ఇచ్చారు.
‘‘ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం సాగిస్తేనే ప్రత్యేక హోదా అప్పుడు సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం ప్రభుత్వం బి జె పి అంధ్రప్రదేశ్ కి తెలుగు ప్రజలకు చేసిన అన్యాయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు కలసి ఉద్యమం చేయ్యటం అవసరం,’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పై కేంద్రం కక్ష సాధింపు చేర్యలు చేపట్టినా ధైర్యం గా తెలుగు ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం సాగించాలని, అలా సాగిస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హొదా ప్రకటించే అవకాశ ఉందని అన్నారు.