సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి తెలంగాణ మంత్రి కేటిఆర్ కు అత్యంత సన్నిహితుడు. హతుడు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావ్ పేట మండలం, కొత్తపల్లి ఎంపిటిసి భర్త వీరబోయిన దేవయ్య గా గుర్తించారు. కొత్తపల్లి గ్రామంలోని హోటల్ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దేవయ్యను హతమార్చారు. పొడిచిన వెంటనే దేవయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ హత్యపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.