తెలంగాణ సిఎం కేసిఆర్, ఆయన మేనల్లుడు, మంత్రి అయిన హరీష్ రావు మీద వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి తీవ్రమైన కామెంట్స్ చేశారు. చిన్నారెడ్డి మాట జారిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ ఆయన తన సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో పరుషమైన మాటలు మాట్లాడారు. కేసిఆర్, హరీష్ ఇద్దరూ టిడిపిని నాశనం చేశారని, అలాంటప్పుడు టిడిపి ఈ వెదవలతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని నిలదీశారు. చిన్నారెడ్డి నోట అలాంటి మాటలు రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చిన్నారెడ్డి వివాదాస్పద కామెంట్స్ చేసిన వీడియో కింద ఉంది.