మ్ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో కొత్త బుల్లెట్ ప్రూఫ్ బస్సు సిద్ధమవుతోంది. ఇందుకోసం సచివాలయంలో ఆర్&బీ, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ నేతృత్వంలో ఓ సమావేశం జరిగింది. బస్సు నిర్మాణంలో ప్రమాణాలు సూచించడానికి ఏర్పాటైన
కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బస్సు కోసం అవసరమైన అన్ని హంగులతో జీఏడీకి ఆర్థిక ప్రతిపాదనలు పంపాలని కమిటీ నిర్ణయించింది. సీఎం, అధికారిక పర్యటనల కోసం స్పేర్ గా మరో వాహనం ఉంచడం కోసం ₹ 7 కోట్లతో అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ బస్సును ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.
జీఏడీ, ఆర్థికశాఖ క్లియరెన్సుల తరవాత ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. ఎల్ 1 గా నిలిచే బిడ్డర్ వచ్చే 2, 3 నెలల్లో కొత్త బస్సును రెడీ చేయనున్నారు. 3 ఏళ్ల క్రితం సీఎం కోసం ₹ 5 కోట్లతో చండీగఢ్ కు చెందిన జేసీపీఎల్ అనే సంస్థ బులెట్ ప్రూఫ్ బస్సును తయారుచేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో పెరిగిన నక్సల్ కార్యకలాపాల నేపథ్యంలో సీఎం భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే కొత్త బుల్లెట్ ప్రూఫ్ బస్సు సిద్ధమవుతోంది.
సీఎం కేసీఆర్ కోసం తయారవుతోన్న బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండాల్సిన ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ప్రత్యేక భద్రతా పరికరాలను సూచించడానికి 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటయింది. కమిటీ మెంబర్ కన్వీనర్ గా సునీల్ శర్మను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా
1. రాజీవ్ త్రివేది, హోంశాఖ ముఖ్యకార్యదర్శి
2. రమణా రావు, జేఎండి, ఆర్టీసీ
3. నవీన్ చంద్, ఐజీ, ఇంటెలిజెన్స్
4. ఎంకే సింగ్, ఐఎస్డబ్ల్యూ చీఫ్
5. శ్రీనివాస్, టెక్నికల్ ఎక్స్పర్ట్, పోలీసు శాఖ.
6. అర్విందర్ సింగ్, కార్యదర్శి, జీఏడీ
7. రవాణాశాఖ కమిషనర్.