మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం సై రా నరసింహారెడ్డి టాలివుడ్ లో మరొక సెన్సేషన్ అవుతుందని అంతా భావిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రం బడ్జెట్ రు. 150 కోట్లని పైకి చెబుతున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో తెల్లవారి దొరతనాన్ని ప్రశ్నించిన కర్నూలు జిల్లా తిరుగుబాటు దారుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ , నయనతార, జగపతి బాబు,విజయ్ సేతుపతి వంటి ఎందరో నటులు కనబడుతున్నారు.
ఇపుడు తాజా సంచలన వార్త వెలువడింది. కొణిదెల ప్రొడక్షన్స్ కింద రామ్ చరణ తీస్తున్న ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమేజాన్ ప్రైం కొనుగోలు చేసింది. రేటెంతో తెలుసా…. రు. 30 కోట్లు. బాహుబలి కంటే రు. 5 కోట్లు ఎక్కువ. అది ికార్డు ఈ చిత్రం ట్రైలర్, టీజర్ తో పాటు అన్ని రకాల డిజిటల్ కంటెంట్ మీద అమేజాన్ కుకాపిరైట్ఉంటుంది. ఇది చాలా పెద్ద డీల్ అని ఫిల్మ్ నగర్ టాక్.
#SyeRaa Record: #MegastarChiranjeevi‘s #SyeRaaNarasimhaReddy‘s digital rights had got Rs.30 crores deal by Amazon Prime Videos.#Bahubali2 Digital Rights : 25crs Stay Tuned :#Chiranjeevi #RamCharan pic.twitter.com/JAVWNigtJw
— ყ🅰️รɦω🅰️ɳƭɦ~AA DHF™ (@Yash_AAdevote_) March 5, 2018