తెలంగాణ సిఎం కేసిఆర్ జాతీయ ఫ్రంట్ పెడతామని చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ కు పొద్దున్నే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెడతామని ఆ పరీక్షలో నెగ్గితే ఫ్రంట్ పై ఆలోచన చేయొచ్చని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు కేసిఆర్ కు లేదని రేవంత్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తి లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి చిన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వీడియోలో మరిన్ని అంశాలున్నాయి కింది వీడియో చూడండి.