“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం “నువ్వు తోపురా”. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా హీరో సుధాకర్ కొమాకుల మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నా పాత్ర అన్ని భావోద్వేగాలను కలగలిపి వినూత్నంగా ఉంటుంది, యువతరం తమని తాము ఈ పాత్ర లో చూసుకుంటారు. ఈ చిత్రం నాకు మరో మెట్టు పైకి ఎదిగేలా చేస్తుందని నమ్ముతున్నాను. నిర్మాతలకి ఈ చిత్రం మొదటిది అయినప్పటికీ కూడా ప్రేక్షకులకి ఒక మంచి చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో కథానుసారంగా ఉత్తమ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ఈ చిత్రం తో ప్రేక్షకుల్లో మరియు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదిస్తామని ఆశిస్తున్నాం” అన్నారు.
చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. “సుధాకర్ కోమాకుల-నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న “నువ్వు తోపురా” చిత్రీకరణ 70% అమెరికాలో, 30% ఇండియాలో షూట్ చేశాం. హాలీవుడ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న “నువ్వు తోపురా” టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ-వైవిఎస్ చౌదరిల వద్ద శిష్యరికం చేసిన ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తయ్యింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
నటీనటులు:
సుధాకర్ కొమాకుల, నిత్యాశెట్టి, నిరోష, రవివర్మ, శ్రీధరన్, దివ్యారెడ్డి, జెమిని సురేష్, దువ్వాసి మోహన్, ఫిష్ వెంకట్, కల్పలత, పద్మజ, జబర్దస్త్ రాకేష్, మహేష్ విత్తా, భాషా, మాస్టర్ సాత్విక్.
టెక్నీషియన్స్ డీటెయిల్స్
సమర్పణ: బేబీ జాహ్నవి
బ్యానర్: యునైటెడ్ ఫిలిమ్స్
నిర్మాత: డి.శ్రీకాంత్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరినాధ్ బాబు.బి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ తోట తరణి (నేషనల్ అవార్డ్ విన్నర్)
సౌండ్ డిజైనర్: శ్రీ పి.ఎ. దీపక్ (గ్రామీ అవార్డ్ విన్నర్)
సినిమాటోగ్రఫీ: ప్రకాష్ వేలాయుధం
ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
స్టంట్స్: విజయ్
కథ-మాటలు: అజ్జు మహంకాళి
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి-శ్రేష్ట-కాసర్ల శ్యామ్
కొరియోగ్రఫీ: విశ్వ రఘు-విజయ్ ప్రకాష్
స్టైలింగ్: అశ్విన్ మావలే
స్టిల్స్: పార్థసారధి
పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్-భాను
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్
సహా నిర్మాత: రితేష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దంతులూరి రవివర్మ
అమెరికా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జేమ్స్ కొమ్ము